Tuesday, March 3, 2020

జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు


జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు 
సాహితీమిత్రులారా!


సమస్య - 
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తి కాంతకై

 సింహాద్రి శ్రీరంగం గారి పూరణ -
సారములేని సంసరణ సాగర మియ్యదటంచు నెంచి, సం
సారము తోడ మెట్లు వరుసన్ తరియించుచు కొండలయ్య! మా
భారము నీవె కావు మని పల్కుచు కోవెలచేరి యందు పూ
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తి కాంతకై

పూరణలో జారులకు గాక పూజారులకు వందనం చేశారనటంతో
సమస్య తొలగిపోయింది కదా

No comments: