Wednesday, September 2, 2026

బృహస్పతి(గురు) స్తుతి

 

బృహస్పతి(గురు) స్తుతి

శ్రీ మోహన్‌లాల్ శర్మ పాండే గారి నతితతి అనే గ్రంథం నుండి

 బృస్పతి(గురు) స్తుతి ఆదివర్ణావృత్తి చిత్రంగా కూర్చబడినది.




గైర్వాణీగీర్గరిష్ఠా గురుగణితగుణా గమ్యగౌరీశగుహ్యాః,
గుణ్యా గంధర్వగేయా గగనగతగుణా గుప్తగోగ్రామగమ్యాః |
గీర్ణా గోవిందగీర్భిర్గరితగదగరా గోత్రభిద్గీయమానాః,
గాయత్ర్యా గీతగీతా గుణిగణగురవో గ్రంథగూఢం గృణంతు || 3 ||

అన్వయము:

గైర్వాణీగీర్గరిష్ఠాః, గమ్యగౌరీశగుహ్యాః, గురుగణితగుణాః, గంధర్వగేయాః, గుప్తగోగ్రామగమ్యాః, గోవిందగీర్భిః గీర్ణాః, గోత్రభిద్గీయమానాః, గాయత్ర్యా గీతగీతాః, గరితగదగరాః, గుణ్యాః, గగనగతగుణాః, గుణిగణగురవో గ్రంథగూఢం గృణంతు.

·         గైర్వాణీగీర్గరిష్ఠాః = అమరభాష (సంస్కృతం) యందు శ్రేష్ఠులైనవారు.

·         గమ్యగౌరీశగుహ్యాః = పార్వతీ పరమేశ్వరుల రహస్యాలను తెలిసినవారు.

·         గురుగణితగుణాః = బృహస్పతి చేత లెక్కించబడిన దయాదాక్షిణ్యాది గుణములు కలవారు.

·         గంధర్వగేయాః = గంధర్వుల చేత గానం చేయదగినవారు.

·         గుప్తగోగ్రామగమ్యాః = గూఢమైన వాణీ సమూహము చేత తెలియబడేవారు.

·         గోవిందగీర్భిః = శ్రీకృష్ణుని వాక్కుల చేత.

·         గీర్ణాః = స్తుతించబడినవారు.

·         గోత్రభిద్గీయమానాః = ఇంద్రుని చేత కీర్తించబడేవారు.

·         గాయత్ర్యా = గాయత్రీ దేవి చేత.

·         గీతగీతాః = గానం చేయబడిన గుణములు కలవారు.

·         గరితగదగరాః = శిష్యుల రోగములను, విషములను హరించువారు.

·         గుణ్యాః = పుణ్యవంతులు/స్తుతించదగినవారు.

·         గగనగతగుణాః = ఆకాశము వరకు వ్యాపించిన గుణములు కలవారు.

·         గుణిగణగురవః = గుణవంతుల సమూహములో శ్రేష్ఠులైన గురువులు.

·         గ్రంథగూఢమ్ = శాస్త్ర రహస్యమును.

·         గృణంతు = ఉపదేశించుగాక.

ప్రతి పదము యొక్క మొదటి అక్షరము '' తో ప్రారంభమైంది. ఇక్కడ బృహస్పతి లేదా జ్ఞాననిధి అయిన గురువు యొక్క గౌరవము వర్ణించబడింది. దేవతలు వ్యవహరించే అమర భారతి (సంస్కృత భాష) యందు శ్రేష్ఠులైనవారు, శివుని రహస్యాలను ఎరిగినవారు, బృహస్పతి వంటి వారిచే గుణములు గణింపబడినవారు, గంధర్వులచే కీర్తించదగినవారు, శ్రీకృష్ణుడు మరియు ఇంద్రుడి చేత స్తుతించబడినవారు, శిష్యుల అజ్ఞానమనే రోగ విషాన్ని హరించువారు, ఆకాశమంతటి దయా గుణము కలవారు మరియు గుణవంతులలో సర్వోపరి అయిన గురువులు మాకు శాస్త్ర రహస్యాలను ఉపదేశించుగాక.

No comments: