Monday, September 14, 2026

అంతటి వాడాకవి

   అంతటి వాడాకవి

సాహితీమిత్రులారా!

ఒక కవికి మరోకవిని చూస్తేనే సరిపడదు. మరీ పొగడడమా? అలా పొగడాలంటే అతగాడెంతటివాడై ఉంటాడో! తొమ్మిదవ శతాబ్దిలో కాశ్మీరులో నివసించిన కవి రాజానక రత్నాకర. ఈయన అంధకాసురునిపై శివుడు సాధించిన విజయం గురించి 50 సర్గలలో మొత్తం 4351 శ్లోకాలను సంస్కృతంలో కూర్చాడు. దీన్ని చదివిన వారు ఆయనను గురించి అనేకమంది అనేకవిధాలుగా ప్రశంసించారు.  వారిలో తొమ్మిదవ శతాబ్దం చివరిలో ఉన్న సుప్రసిద్ధ  నాటక కర్త, అంకారికుడు అయిన రాజశేఖరుడు ఈ విధంగా ప్రశంసించారు...........

                 మా స్మ శాంతి హి చత్వారః ప్రాయో రత్నాకరా ఇమే 

                 ఇతీవ స కృతో ధాత్ర కవి రత్నాకరో 'పరః

నాలుగు సముద్రాలు సరిపోవని భావించిన సృష్టికర్త బ్రహ్మదేవుడు, రత్నాకర కవి అయిన మరో సముద్రాన్ని సృష్టించాడు .(రత్నకర= సముద్రం).


అలాగే  సదాశివశాస్త్రి అనే కవి ఈ విధంగా ప్రశంసించారు- 

దుగ్ధాబ్ధీనాం సహస్రం న కుసుమలసితం సద్వసన్తాయుతం వా

కోటిర్ వా పార్వణానాం సుషమశశభృతాం నేషదోషాతనానామ్।

సంపూర్ణం వా సుధాభిః పురటఘటశతం హన్త ధన్వన్తరేర్నో

పాణిస్థం చారు రత్నాకరసుకవిగిరాం మేరులక్షం న మూల్యమ్॥

వేయి పాల సముద్రాలు గానీపూలతో శోభిల్లే పదివేల వసంత రుతువులు గానీ,  కోటి శరత్కాల పూర్ణచంద్రుల ధవళ కాంతులు గానీధన్వంతరి చేతిలోని అమృతంతో నిండిన  వంద అందమైన బంగారు కలశాలు గానీకడకు లక్ష మేరు పర్వతాలు సైతం—   సత్కవియైన రత్నాకరుని వాక్కుల (కవితా వైభవం) విలువకు సరితూగలేవు!


No comments: