Monday, February 13, 2023

Could you write a lipogram?

 Could you write a lipogram?




సాహితీమిత్రులారా!

What if you had to write something but you were not allowed to use a certain letter? That would be quite a challenge, right? Well, some writers have challenged themselves to write entire books which completely leave out a particular letter. Writing like this, prose or poetry, which deliberately leaves out one or more letters is called a lipogram. Of course, it doesn’t have to be as long as an entire book. It could be a short poem, a paragraph or a sentence. If you want to discover some great examples of lipograms, keep watching. 





Saturday, February 11, 2023

This Film Has No “E” In It

 This Film Has No “E” In It




సాహితీమిత్రులారా!

'E' is the most common letter in the English language. In fact, in the previous sentence it appeared seven time in just 10 words.

That's what made Gadsby, so remarkable; a 50,000 word novel that doesn't use the letter 'E' at all. In this video I explore this type of writing, and take the challenge of putting together a (hopefully) coherent video with the same limitation.

with the courtesy of Julian O'Shea



Thursday, February 9, 2023

శ్రీరామకథ - తో చిత్రకావ్యాలు

  శ్రీరామకథ - తో చిత్రకావ్యాలు 




సాహితీమిత్రులారా!


శ్రీరామాయణగాథ ప్రభావం సాహిత్యప్రక్రియ లన్నిటిపై  ఉందనడం

 సత్యదూరం  కాదు. ప్రస్తుతం  అలాటి  రచనలలో చిత్రకావ్యాలను నామమాత్రంగ స్మరిద్దాం-

 శ్రీ మద్వాల్మీకి రామాయణం యుద్ధకాండలో-----

శ్లో.మండలాని విచిత్రణి  స్థానానివివిధానిచ,

   గోమూత్రికాదిచిత్రాణి   గతప్రత్యాగతాని చ.

                                                                                          - వా.రా.యుద్ధకాం,౪౦-౨౮

అనే శ్లోకంలో గోమూత్రికాబంధచిత్రవిశే షంవలె  సైన్యం యుద్ధం చేసినారని 

కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

వివిధకవిపండితులురామాయణాన్ని

సంస్కృతంలో చిత్రకవనంలో రచించి నారు. ఆ  పేర్లు ----

కవిపేరు                      చిత్రరచనపేరు

వేంకటేశ్వర         --రామయమకార్ణవః

వేంకటేశ               --రామచంద్రోదయం

గోపాలార్య           --రామచంద్రోదయం

కృష్ణమోహన        --రామలీలామృతం

శ్రీకాంత                       --రఘూదయం 

చిదంబరకవి        -శబ్దార్థచింతామణిః

వేంకటాధ్వరి     --రాఘవయాదవీయం

దైవజ్ఞసూరి --రామకృష్ణవిలోమకావ్యం

శ్రీకాంత                     --రఘూదయం

నారాణభట్ట     --నిరనునాసికచమ్పూః

మల్లికార్జున     --నిరోష్ఠ్యరామాయణం

వేంకటార్య--శ్లేషచమ్పూరామాయణ 

ధనంజయ-రాఘవయాదవపాణ్డవీయ

చిదమ్బరకవి  -పంచకల్యాణచమ్పూః

సన్ధ్యాకరనన్దినః           --రామచరితం 

సన్ధ్యాకరనన్దినః   - రాఘవయాదవపాణ్డవీయం

వేంకటాచార్య-శ్లేషచమ్పూరామాయణ

వేంకటేశ్వర-- చిత్రబన్ధరామాయణం

వేంకటాచార్య-కంకణబన్ధరామాయణ

కృష్ణకవి    --క్రియాగోపనరామాయణం

కృష్ణరాయ        --ఆర్యాలంకారశతకం

వీరరాఘవ      --విశేషణరామాయణం

రామభద్ర                 --రామస్తవప్రాసః

నిట్టలఉపమాక}

వేంకటేశ్వర      } -రామాయణసంగ్రహః

భాస్కరసూరి.           --సీతారామీయం

సుబ్రహ్మణ్యసూరి        --రామావతారః

సుబ్రహ్మణ్యసూరి      --సీతాకల్యాణం

సుబ్రహ్మణ్యసూరి - రామాయణడోలగీత

సుబ్రహ్మణ్యసూరి - ఆసేచనకరామాయణం

వేంకటేశవామన   --రామచన్ద్రోదయం

ముడుమ్బై వేంకట    }రామచన్ద్ర-

రామనరసింహాచార్య}  కథామృతం

డా.కే.ఎస్.రామానుజాచార్య--శ్రీరామబాణస్తవః

 ఇవి సంస్కృతంలో ప్రసిద్ధమైనవి.


తెలుగుచిత్రకవనం-రామాయణం:

దశరథరాజనందనచరిత్ర(నిరోష్ఠ్యం)-- మరింగంటిసింగరాచార్య

శుద్ధాన్ధ్రనిరోష్ఠ్యసీతాకల్యాణం--మరింగంటి సింగరాచార్యులు

నిరోష్ఠ్యసీతాకల్యాణం   --పిడుపర్తి బసప్ప

నిరోష్ఠ్యరామాయణం--సురపురంకేశవయ్య

నిరోష్ఠ్యజానకీకల్యాణం--పోడూరి రామన

శివరామాభ్యుదయద్వ్యర్థికావ్యం-- పోడూరి పెదరామామాత్య

నిరోష్ఠ్యదాశరథిశతకం--మండపాక పేరయకవి

నిరోష్ఠ్యదశరథతనయశతకం--వేదుల నారాయణకవి

అచ్ఛాంధ్రనిరోష్ఠ్యనిర్గద్యదాశరథిచరిత్ర -- హనుమంతరాయశర్మ

నిర్వచనభారతగర్భరామాయణం-- రావిపాటిలక్ష్మీనారాయణ

గాదె పాపరాజు - చతుర్ముఖ రామాయణం

నాదెళ్ల పురుషోత్తమకవి - చతుర్ముఖ కంద రామాయణం

                                                                మొదలయినవి ప్రసిద్ధమైనవి

                

     వైద్యంవేంకటేశ్వరాచార్యులవారి సౌజన్యంతో

Tuesday, February 7, 2023

ద్విపద కందగుప్తం

ద్విపద కందగుప్తం






సాహితీమిత్రులారా!



కందపద్యంలోనే ద్విపద గుప్తంగ ఉండే రచనను  ద్విపదకందగుప్తం 

అంటారు.అంటే కందపద్యం ద్విపద లక్షణంకూడ కలిగిఉంటుంది. 

          ఈ  కింది కంద ద్విపద గణాది

లక్షణాలను నిశితంగ పరిశీలిస్తే ద్విపద

కందగుప్త రచనలో ఉండే కిటుకు తెలుస్తుంది.


క.కలువలదొర మానికముల

   దళంపు తలపుల నెపుడును-దగలోగొనగన్

   గల తరగల పాలకడలి

   చెలంగు చెలువుని నిను గొలి-చెద లోకమునన్.

పై కందంలో గుప్తమైన

ద్విపద:

కలువలదొరమాని-కములదళంపు

తళుకులనెపుడును-దగ లో గొనగను

గల తరగల పాల-కడలి చెలంగు

చెలువుని నిను గొలి-చెదలోకమునన

     పై పద్యం గణపవరం వేంకటకవి

రచించిన "ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం"(143)లో ఉంది.

                         

వైద్యంవేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు

 

Sunday, February 5, 2023

మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ - అంటే ఏమిటి?

  మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ - అంటే ఏమిటి?





సాహితీమిత్రులారా!



ఒక సాహితీమిత్రునికి శ్రీనాథ మహాకవి అంటే వీరాభిమానం.

నాకేమో బమ్మెరపోతన అంటే భక్తి, అభిమానం.

అతడొకపర్యాయం నాతో ఇలా అన్నాడు-

మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ. - అంటే ఏమిటీ అని అడిగినాడు. 

ఇదేదో సాంకేతికాక్షర  సముదాయంలా  ఉంది అన్నాను.

కరెక్ట్ రూట్ లోనేఉన్నావ్,ప్రయత్నించు

అన్నా డతడు.

నాకు స్ఫురించలేదు.

అతడు ఇలా చెప్పినాడు--

'మరు'       - మరుత్తరాట్చరిత్ర

   'శా'        - శాలివాహనసప్తశతి

  'పం'       - పండితారాధ్యచరిత్ర

 'కాశీ'       - కాశీఖండం

  'ధ'         - ధనంజయవిజయం

  'నం'       - నందనందనచరిత్ర

  'ప'         - పల్నాటి వీరచరిత్ర

   'హ'       -హరవిలాసం

  'శి'          - శివరాత్రి మాహాత్మ్యం          

  'క్రీడా'     - క్రీడాభిరామం

'శృంగార'  - శృంగారనైషధం

  'భీమ'    - భీమఖండం

       ఇంతేనా! ఇంకాకొంచెం ఆలోచించి

ఉంటే  తప్పక  గుర్తించేవాణ్ణి,  అంటూ నేను   *భోవీనామ*  అంటే  ఏమిటీ!

అన్నాను,ఇదేదో రాజీనామా మాదిర ఉంది అంటూ నవ్వులు రువ్వినాడు.

    ఒరేయ్ నీ బాటలోనే నడిచినాను,

నీవు చెప్పినదే నిన్ను మార్పుచేసి అడుగుతున్నాను.

 మా  మహాకవి బమ్మెరపోతన గ్రంథాల

పేర్లు అంటూ---

భో ---భోగినీదండకం

వీ  ---వీరభద్రవిజయం

నా---నారాయణశతకం

మ---మహాభాగవతం

  అన్నాను.

        ఇద్దరం నవ్వుకున్నాం.

         జరిగిన సంఘటన

                                                               వైద్యం వారి సౌజన్యంతో

Friday, February 3, 2023

కవిసింహ పోకూరికాశీపతి

 కవిసింహ పోకూరికాశీపతి




సాహితీమిత్రులారా!



కవిసింహ పోకూరి కాశీపతి

జననం:ఫిబ్రవరి-1893,బోదెలవీడు,పల్నాడుతా.

కీ.శే:తే27-12-1974, మాచర్ల

ప్రథమ అష్టావధానం:నరసరావుపేట1916

అనేక అవధానాలు వివిధప్రాంతాలలో.

నరసరావుపేట,ఉయ్యూరు,గద్వాల 

రచనలు:అరవై చేసినట్లు తెలుస్తోంది.

లభ్యరచనలు:

      1.నిరోష్ఠ్య నిర్వచన శుద్దాంంధ్రహరిశ్చంద్రోపాఖ్యానం

      2.సారంగధరీయం-త్య్రర్థికావ్యం

      3.సిద్ధయోగి చరిత్ర

      4.శౌరిశైశవలీల , పంచవర్గాక్షర రహిత రచన

      5.అలివేలుమంగా వేంకటేశ్వరసంవాదం

      6.వీరతిమ్మమాంబచరిత్రం

      7.సుజ్ఞానప్రబోధిని

      8.సునీతిశతకం

      9.కేశవేంద్రశతకం

     10.మన్నెముకొండవేంకటేశ్వరశతకం(ఏకప్రాస)

      11.హనుమత్ప్రభుశతకం(హలహర్వి హనుమంత రెడ్డిని గురించినశతకం)

      12.నారసింహప్రభుశతకం

      13.శ్రీమల్లేశ్వరశతకం

      14.నరసింహనిరసనస్తుతి

      15.సత్యనారాయణ వ్రతకల్పం

      16.త్రింశదర్థపద్యరత్నం

      17.కాశీపతి చమత్కృతి

      18.వివిధ సందర్భాలలో చెప్పిన చాటుపద్యరత్నాలు

       19.కాఫీదండకం (ఆశువు)

        మిగత రచనలనుగురించి అన్వేషణ చేయవలసిఉంది.

        బిరుదాలు:        

కవిసింహ,   కవిజటిల,  కవిశోరోమణి,    కవితాప్రవీణ,

ఆశువికోకిల,    ఆశుకవిపుంగవ,  కవిశిఖామణి,     అవధానప్రవీణ,

చిత్రకవిత్వపంచానన, కళాపరిపూర్ణ,     మహాకవిశేఖర

సన్మానాదులు:  

కనకాభిషేకం గండపెండేరసన్మానం

గజారోహణం రథోత్సవం

 స్వర్ణకంకణప్రదానాలు

 ద్రవ్యబహూకరణలు

రాష్ట్రపతి డా.రాధాకృష్ణన్ చే సన్మానం

వీరినిగురించి కొంత  పరిశోధన జరిగింది.

విద్వద్గద్వాలసంస్థానకవివర్యులుగా

 ఉండినారు.మరెన్నో సంస్థానాలలో

సదస్సులలో స్వీయ కవితా ప్రదర్శనంచేసి సత్కారాలు పొందినారు

ఇంకా ఎంతో పరిశోధనజరుగవలసిఉంది 

 కవిసింహగారి రచనలన్నీ విడివిడిగానూ,

 ఒకే బృహత్సంపుటంగాను ప్రచురితం కావలసి ఉంది.

దీనికోసం ఎవరైన కంకణబద్ధులై కార్యోన్ముఖులుకావలసి ఉంది  


రచన:వైద్యంవేంకటేశ్వరాచార్యులు

Wednesday, February 1, 2023

ముక్కుమీద పద్యం

 ముక్కుమీద పద్యం 





సాహితీమిత్రులారా!


పారిజాతాపహరణం అనే కావ్యాన్నినందితిమ్మనరచించిశ్రీకృష్ణదేవరాయల

వారికి అంకిత మిచ్చినాడు. నందితిమ్మన ముక్కును గురించి ఒక

పద్యాన్ని   రచించినందుకు  ఆయనకు ముక్కుతిమ్మనఅనే వ్యవహారం కలిగిందని

 అంటారు.ముక్కును గురించిన ఆ పద్యాన్నితిమ్మనదగ్గర రామరాజభూషణుడు   కొంత 

 ద్రవ్యంఇచ్చి కొని తన వసుచరిత్రయందుఉపయోగించుకున్నా డంటారు.ఆ పద్యం---

నానాసూనవితానవాసనల నా-నందించు సారంగ మే

లా నన్నొల్లదటంచు గంధఫలి బ-ల్కాకం దపంబంది యో

షా నాసాకృతి దాల్చి సర్వసుమన-స్సౌరభ్య సంవాసియై

పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ - పుంజంబులిర్వంకలన్.

 పద్యం రామరాజభూషణకృతమే,ఐతే

కొన్ని అపప్రచారాలు ఇలా ప్రచారమౌ తుంటాయి.

అయితే----

ఈ పద్యానికిమూలమనదగినశ్లోకం పద్నాలుగవశతాబ్దంలోని 

అగస్త్యుని 'నలకీర్తికౌముది' అనే కావ్యంలో ఉంది.

ఆ శ్లోకం-----

      "భృంగా నవాప్తి ప్రతిపన్న భేదా

      కృత్వా వనే గంధఫలీ తపోలం,

      తన్నాసికాభః దనుభూత గంధా

     స్వపార్శ్వ నేత్రీ కృత భృంగ సేవ్యా"

             

వైద్యంవేంకటేశ్వరాచార్యులుగారి సౌజన్యంతో