మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ - అంటే ఏమిటి?
సాహితీమిత్రులారా!
ఒక సాహితీమిత్రునికి శ్రీనాథ మహాకవి అంటే వీరాభిమానం.
నాకేమో బమ్మెరపోతన అంటే భక్తి, అభిమానం.
అతడొకపర్యాయం నాతో ఇలా అన్నాడు-
మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ. - అంటే ఏమిటీ అని అడిగినాడు.
ఇదేదో సాంకేతికాక్షర సముదాయంలా ఉంది అన్నాను.
కరెక్ట్ రూట్ లోనేఉన్నావ్,ప్రయత్నించు
అన్నా డతడు.
నాకు స్ఫురించలేదు.
అతడు ఇలా చెప్పినాడు--
'మరు' - మరుత్తరాట్చరిత్ర
'శా' - శాలివాహనసప్తశతి
'పం' - పండితారాధ్యచరిత్ర
'కాశీ' - కాశీఖండం
'ధ' - ధనంజయవిజయం
'నం' - నందనందనచరిత్ర
'ప' - పల్నాటి వీరచరిత్ర
'హ' -హరవిలాసం
'శి' - శివరాత్రి మాహాత్మ్యం
'క్రీడా' - క్రీడాభిరామం
'శృంగార' - శృంగారనైషధం
'భీమ' - భీమఖండం
ఇంతేనా! ఇంకాకొంచెం ఆలోచించి
ఉంటే తప్పక గుర్తించేవాణ్ణి, అంటూ నేను *భోవీనామ* అంటే ఏమిటీ!
అన్నాను,ఇదేదో రాజీనామా మాదిర ఉంది అంటూ నవ్వులు రువ్వినాడు.
ఒరేయ్ నీ బాటలోనే నడిచినాను,
నీవు చెప్పినదే నిన్ను మార్పుచేసి అడుగుతున్నాను.
మా మహాకవి బమ్మెరపోతన గ్రంథాల
పేర్లు అంటూ---
భో ---భోగినీదండకం
వీ ---వీరభద్రవిజయం
నా---నారాయణశతకం
మ---మహాభాగవతం
అన్నాను.
ఇద్దరం నవ్వుకున్నాం.
జరిగిన సంఘటన
వైద్యం వారి సౌజన్యంతో
1 comment:
రమణరాజుగారు కాస్త మీ డీఎం తెరుస్తారా?
లేదా దయచేసి నాకు డీఎం/మెసేజ్ చేయగలరు.
🙏🏼🙏🏼🙏🏼
- లక్ష్మీ నరసయ్య (ట్విట్టర్ లో @aaryanudi)
Post a Comment