Sunday, January 15, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 1


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 1
సాహితీమిత్రులారా!


సంస్కృతంలో కాళిదాసు కుమారసంభవము వ్రాయగా
తెలుగున నన్నెచోడకవిరాజు కుమారసంభవము వ్రాశారు.
ఆధునికకాలంలో శ్రీ కొడవలూరు రామచంద్రరాజు గారు
కుమారసంభవాన్ని మహాసేనోదయ ప్రబంధమనుపేర
మహాకావ్యాన్ని వ్రాశారు. ఇది చిత్రకవిత్వ భరితమైన
కావ్యం దీనిలోని చిత్రకవిత్వాన్ని ఇక్కడ చూద్దాము-

చిత్రకవిత్వంలో పాదగోపనము
గూఢచిత్రం క్రిందికి వస్తుంది
ఇది మహాసేనోదయము
ప్రధమాశ్వాసములో 219వ పద్యంగా ఉంది.
చూడండి-

పాదగోపనము అంటే ఇందులో చాలరకాలు ఉన్నాయి.
ప్రథమపాగూఢము, ద్వితీయపాదగూఢము,
తృతీయపాదగూఢము, చతుర్థపాదగూఢము లేక
గూఢచతుర్థి అనేవికాక మరికొన్ని రకాలున్నాయి.
ఇందలోని పాదగూఢము గూఢచతుర్థి.
అంటే మొదటి మూడు పాదాలలో గోపన
పరచిన అక్షరాలను కలుపగా నాగువపాదము వస్తుంది.
అంటే నాలుగవ పాదము గోపనము లేక గూఢపరచినది.

వనజసమాననేత్రక కృపాజలధీశ సరస్తవ క్షమా
హననదురాసదార్ధిప్రణతా సమరోన్నత సాదరాశయా
మునిమహనీయలాలసవిభూత్యభిసేవన ధూర్తభంజనా

ఈ మూడు పాదాలలో చివరిదైన
నాలుగవ పాదం గూఢంగా ఉంది
అతి ఎలా తెలుసుకోవాలంటే
మొదటి పాదంనుండి ప్రతి మూడవ
అక్షరం తీసుకుంటే 4వపాదం వస్తుంది

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా

ఆ అక్షరాలన్నీ కలుపగా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా -
అని ఏర్పడుతుంది.
పూర్తి పద్యం క్రింద చూడండి-

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా


ప్రథమాశ్వాసంలో
శబ్దచిత్రంలో భాగమైన ప్రాసచిత్రం సంబంధమైనవి-
ప్రాస అంటే రెండవ అక్షరం
అది రెండవఅక్షరం కాక ఎక్కువగా కూర్చడం
ప్రాసచిత్రంగా చెబుతారు
ఇక్కడ అలా కూర్చబడిన పద్యాలు రెండున్నాయి చూడండి -

శూద్రవర్ణనము - ద్విప్రాసలో కలదు.
రెండు అక్షరాలను ప్రాసగా కూర్చడం ద్విప్రాసము.

రుద్రులు జన్యంబున బల
ద్రులుదోర్బలమునందు బలువితరుణలే
ద్రులు సుగుణసముద్రులు
ద్రులుఁబృధుధైర్యమహిమ నచ్చి శూద్రుల్
                                                                                             (1-202)

రథ వర్ణనమున చతుష్ప్రాసము కలదు-
నాలుగక్షరాలను ప్రాసగా కూర్చడం చతుష్ప్రాసము.

రదంబులు రిపుసేనా
రదంబులు గేతుపవనదారితశుంభ
చ్ఛరదంబులుదగ్రతమం
దరదంబులు మెఱయు నచటఁదతమణిదీప్తిన్
                                                                                         (1-205)

శబ్దాలంకార చిత్రంలో -
ఆశ్వాసాంతమున ముక్తపదగ్రస్తము కూర్చబడింది-
ముక్త పద అంటే విడువ బడిన పదము,
గ్రస్త అంటే తీసుకోబడిన - అని అర్థం.
అంటే ఒకపదాన్ని విడిచి మళ్ళీ తీసుకోవడం
ఇది శబ్దాలంకారాలలోని. ఈ పద్యలో గమనించండి-

అనుపమసత్యవైభవ భవాంబుధితారక తారకాధిరా
డినయనద్వయాద్వయమునీంద్రమనోంబుజవాల వాలవా
వన వనజాసనాద్యమరవంద్యపదా పదజిద్ఘనాఘనా
ఘననమవిగ్రహా గ్రహనికాయ వరాభిజనాభివర్ధనా!

                                                                                                       (1-217)


ముక్తపదగ్రస్తములో ఆంజనేయ స్తుతి(1-8) మరియు
విష్ణుబ్రహ్మేద్రాదులు శూరపద్మాసురుని వధించటానికి
కుమారునిమ్మని ఈశ్వరుని ప్రార్థించే
 సందర్భంలోని పద్యం(1-75)
ఇవి రెండు సీసపద్యాలలో కూర్చబడిన ముక్తపదగ్రస్తాలు


అంత్యప్రాసాలంకారంలో కూర్చబడినది-
బ్రహ్మ స్తోత్రము (1-3)మరియు
ఉమాసమేతుడై శివుడు వృషభారోహణం
చేసి వెళ్ళే సమయంలో కూర్చబడినది.

అసమానకృపాపాంగన్
రసితబకక్రౌంచహంస రాజతే భృంగన్
లసదమలమంగళాంగన్
రసధిమనోవికసనాంతరంగన్ గంగన్
                                                                                  (1-129)

ఆకారచిత్రంలో(బంధకవిత్వం) కూర్చబడినవి-

1. చక్రబంధం (1-76)

2. ఖడ్గబంధం (1-119)

భాషాచిత్రం-
లక్ష్మీదేవి స్తుతి - శుద్ధాంధ్రసీసము(1-2)

ఇవన్నీ ప్రధమాశ్వాసంలోనివే

No comments: