Sunday, March 5, 2017

వీరవరకైరవరవీ


వీరవరకైరవరవీసాహితీమిత్రులారా!


పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని
జైమినీ భారతములోని
గతిచిత్రం చూడండి-

ఇది 8వ ఆశ్వాసాంతములో కూర్చబడినది.

ఏ పాదానికి ఆ పాదం
ముందునుడి వెనుకకు
వెనుకనుండి ముదుకు
చదువవచ్చును ఆ పద్యం -

వీరవరకైరవరవీ
సారసభర సౌధయూధ సౌరభసరసా
వారణరథ్య రణరవా
తారభవనతాన మానతానవభరతా

ఈ పద్యంలో ప్రతిపాదం గమనించండి
ఇందులో ప్రతిపాదంలో ఒక అక్షరం దగ్గరనుండి
అవే అక్షరాలు పునరావృతం కావడం వల్ల పాదం
ఒకలాగే వచ్చేందుకు వీలౌతుంది.
దీన్ని పాదభ్రమకం అంటారు

ఈ పద్యంలో కీలకమైన అక్షరాన్ని
మరో రంగులో చూడవచ్చు
గమనించండి

వీరవరకైరవరవీ
సారసభర సౌధయూధ సౌరభసరసా
వారణరథ్య రణరవా
తారభవనతాన మానతానవభరతా
No comments: