Thursday, March 9, 2017

వరాహపురాణలోేని చిత్రకవిత - 2

వరాహపురాణలోేని చిత్రకవిత - 2
సాహితీమిత్రులారా!వరాహపురాణములో చిత్రకవిత్వంలోని భాగమైన
గర్భకవిత్వం కూడ జంటకవులు కూర్చారు
ఈ క్రింద గమనిద్దాం-
తొమ్మిదవ ఆశ్వాసాంతంలో
ఈ గర్భకవితకు చెందిన పద్యం ఉంది-

కందద్వయ గరభ భాస్కరవిలసిత వృత్తము-
భాస్కరవిలసితమనే ఈ వృత్తంలో
రెండు కందపద్యాలను ఇమిడ్చారు
చూడండి-

భాస్కరవిలసితానికి గణాలు-
భ-న-జ-య-భ-న-న-స-గ
యతి 12వ అక్షరము.

పండిత కవిజన రక్షణ శౌండా భాస్కరవిలసిత సరసనవశ్రీ
ఖండ సురభి రమణీకుచ గండాగ్ర శ్రమజలకణ ఘనతరహారా
చండరణ ఖురళి సామజ శుండాస్తంభగణదళన సులభ విహారో
ద్దండ భుజమలయజద్రుమ కాండాధార భయదభుజగదసి కఠోరా
                          (వరాహపురాణము - 9- 156)

ఇందులో మొదటి రెండు పాదాలు ఒక కందపద్యంగాను
చివరి రెండు పాదాలు మరో కందపద్యంగాను ఇమిడ్చారు

పండిత కవిజన రక్షణ శౌండా భాస్కరవిలసిత సరసనవశ్రీ
ఖండ సురభి రమణీకుచ గండాగ్ర శ్రమజలకణ ఘనతరహారా
చండరణ ఖురళి సామజ శుండాస్తంభగణదళన సులభ విహారో
ద్దండ భుజమలయజద్రుమ కాండాధార భయదభుజగదసి కఠోరా

మొదటి కందపద్యం-
పండిత కవిజన రక్షణ 
శౌండా భాస్కరవిలసిత సరసనవశ్రీ
ఖండ సురభి రమణీకుచ 
గండాగ్ర శ్రమజలకణ ఘనతరహారా!

రెండవ కందపద్యం-

చండరణ ఖురళి సామజ 
శుండాస్తంభగణదళన సులభ విహారో
ద్దండ భుజమలయజద్రుమ 
కాండాధార భయదభుజగదసి కఠోరా!

No comments: