Saturday, March 11, 2017

చిత్రకవిత్వంలో గర్భకవిత -2


చిత్రకవిత్వంలో గర్భకవిత -2




సాహితీమిత్రులారా!


కందంవ్రాసినవాడు కవి
పందిని చంపినవాడు బంటు -
అనికదా మనవారు అంటుంటారు
మరి అలాంటి కందంలో కందపద్యంకాదు
మరోరకమైన ఛందస్సు కలిగిన పద్యం
ఇమిడ్చడం కష్టమేకదా
ఇక్కడ కందపద్యంలో మణిగణనికరమును
ఇమిడ్చిన విధానం చూద్దాం

వరాహపురాణంలోని(11-112) ఈ పద్యం చూడండి-

మణిగణనికరానికి గణాలు
4న-గణాలు + స - గణం 
9వ అక్షరము యతి.

ఈ కందపద్యంలో ఇమిడ్చారు గమనించండి-

కందగర్భమణిగణనికరము-

డమరుక సరభస డమడమ
సమ విశ్రములయి మొరయ సమణివలయముల్
గమకపుఁ జనుఁగవ గదలఁగ
సమర శ్రమఫలము గలుగ సరగునఁ బొడిచెన్

ఇందులో
డమరుక సరభస డమడమ సమవి - వరకు
మొదటిపాదం సరిపోతుంది.
ఇక రెండవపాదం
శ్రములయి మొరయ సమణివలయముల్

మూడవపాదం
గమకపుఁ జనుఁగవ గదలఁగ సమర

నాలుగవపాదం-
శ్రమఫలము గలుగ సరగునఁ బొడిచెన్

వీటిలో ప్రతిపాదానికి 4 నగణాలు ఒక సగణం
ఉన్నాయి. మొదటిపాదం, మూడవపాదం నందు
చివరిలో ఉన్న అక్షరాైనికి ముందుక్షరం సంయుక్తాక్షరం
కావున దాని ముందక్షరం గురువుగా అవుతుంది.

పూర్తి పద్యం ఇది-

డమరుక సరభస డమడమ సమవి
శ్రములయి మొరయ సమణివలయముల్
గమకపుఁ జనుఁగవ గదలఁగ సమర
శ్రమఫలము గలుగ సరగునఁ బొడిచెన్




No comments: