Monday, January 9, 2017

నీటి మీది బుడగల్ మీసాలపై తేనియల్


నీటి మీది బుడగల్ మీసాలపై తేనియల్
సాహితీమిత్రులారా!

సమస్య -
మెరుపుందీవెలు నీటి మీది బుడగల్ మీసాలపై తేనియల్


బాపట్ల వేంకట పార్థసారథిగారి పూరణ -

పరమోదార విశుద్ధవర్తనము; సద్వంశంబు, సద్భావ సుం
దర రూపంబుల నీడు జోడయిన కన్యారత్నమున్ గోరనౌ;
వరకట్నంబులు లాంఛనంబులు వరుల్ వాంఛింపరాదీ సిరుల్
మెరుపుందీవెలు, నీటి మీది బుడగల్, మీసాలపై తేనియల్


ఎంత చక్కగా పూరించాడు


మీరును మరోరకంగా పూరించి పంపండి

No comments: