Monday, January 9, 2017

ఏకాక్షర నిఘంటువు - 36


ఏకాక్షర నిఘంటువు - 36




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........


ఉద్ - ఈ క్రింది అర్థములలో ఉపయోగింప బడుతున్నది
                ఉన్నతస్థానము, వినియోగము, బయట, నుండి,
               పైకి పోవుట, సంపాదించుట, ప్రచారము, ఆశ్చర్యము,
                ఉత్కంఠ మొదలైనవి.

  - వాక్యారంభము, రక్షించుట, గురుస్వరూపము, ఇచ్ఛ, స్వామ్యం

ఊం - కోపంతో పలుకుట, అడుగుట, నింద, పోటి

ఊః - పురుషుడు, చంద్రుడు, రాజపుత్రుడు, కంఠము, దేవత,
               గొప్పముంగిలి, సాటి, నిండుకడవ(పూర్ణకుంభం),
              వర్తకుడు, రక్షించుట,  రక్షకుడు, మహేశ్వరుడు,
              పోలిక, , ఇంద్రుడు

 - వాక్యము, నిందించుట

ఋధ్ - వృద్ధినొందుట, వర్ధల్లుట, తృప్తినొందుట

 - వాక్యము, కాపాడుట, నింద, భయము

ౠః - తలవెండ్రుక, పాము, చూపు, దరిద్రుడు, స్వర్ణము,
                 కమలము, స్వర్గము, డబ్బు, నేరేడుచెట్టు, భైరవుడు,
                 దానవుడు

మ్ - సమ్మోహనకరమూ ఉజ్వలమూ అయిన ఒక బీజాక్షరం


ఌః - శివుడు, ఏనుగుదంతము, ఎండ్రకాయ, కోతి, కోర,
             స్వర్గము, అదితిదేవి, గంధము మొదలైన వాటిచే
            పూయబడిన శరీరము, చనిపోయిన మనుమడుగలవాడు,
            ఱొమ్ము, కాపాడుట.

 - ఊసరవెల్లి, పర్వతము, శరీరము, శుభమును చేయువాడు,
              దేవత, విలాసగమనము, కన్ను, ఎముక, కద్రువతల్లి, స్త్రీ.

 - తేజస్సు, ఉదకము, రాత్రి, మేడయొక్క మధ్యభాగము, విష్ణువు.

ఏజ్ - వణకుట, కదలుట, ప్రకాశించుట

ఏధ్ - వృద్ధినొందుట, సుఖముగా జీవించుట

No comments: