Tuesday, January 24, 2017

రణమే శాంతికి సాధనంబనుచు


రణమే శాంతికి సాధనంబనుచు
సాహితీమిత్రులారా!


సమస్య -
రణమే శాంతికి సాధనంబనుచు నారాధింతు మెవ్వేళలన్

బాపట్ల వేంకట పార్థసారథి గారి పూరణ -

మణిభూషాంబర వస్తుసంపదలు నీమాయా ప్రపంచంబు నం
దణుమాత్రంబును దృప్తినీయకయె - దుర్వ్యామోహమున్ బెంచు, ర
క్షణ భారంబు వహించు నీశ్వరుఁడు నిష్టార్థంబులన్ గూర్చు కా
రణమే శాంతికి సాధనంబనుచు నారాధింతు మెవ్వేళలన్

దీనిలో కవిగారు రణమే - అనే దాన్ని కారణమే
అని మార్చడం వలన అర్థవంతమైనదిగా మారినది.మీరును మరోరమ్యమైన భావనతో పూరించి పంపగలరు

No comments: