Thursday, January 12, 2017

నెలలో సుతుఁగన్న తల్లి నిగనిగలాడెన్


నెలలో సుతుఁగన్న తల్లి నిగనిగలాడెన్
సాహితీమిత్రులారా!


సమస్య -
నెలలో సుతుఁగన్న తల్లి నిగనిగలాడెన్

బాపట్ల వేంకట పార్థసారథి గారి పూరణ-

తొలుచూలున మగబిడ్డడు 
కలిగిన ఘనమన్న భర్త కలవరపడె రో
జులు గడిచినవని పదియవ
నెలలో సుతుఁగన్న తల్లి నిగనిగలాడెన్

నెలలో కాదు పదియవనెలలో అని
మార్చడం వలన
అర్థవంతంగా మారింది సమస్య


మీరునూ మరోవిధంగా పూరించి పంపగలరు

No comments: