Sunday, December 3, 2017

శైల బంధం


శైల బంధం




సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తి గారి
శ్రీమత్ప్రతాపగిరి ఖండములోని
ఈ శైలబంధం చూడండి-

ఇది కందపద్యంలో కూర్చబడింది-

ప్రణుతామర భూప! యధ
ర్వణ! భోగివిభూష! దేవ! అపరిమితాభా!
త్రిణయన! భవ! ఖండపరశు
గుణధుర్యా! దనుజడంబ కుంఠిత వీర్యా!

ఈ బంధం మధ్యలో ప్రతాపగిరిఖండం అని కూర్చబడింది.
పద్యాన్ని బంధం చూస్తూ చదవండి.




Friday, December 1, 2017

అనులోమవిలోమ కందము


అనులోమవిలోమ కందము




సాహితీమిత్రులారా!


అనులోమవిలోమ కందమంటే
పద్యం మొదటినుంటి చివరికి చదివిన
అది అనులోమము అదే పద్యం చివరినుండి
మొదటికి చదివిన విలోమం ఈ రెంటిని కలిపిన
అనులోమ విలోమం ఎటుచదివినా పద్యం ఒకలాగే
ఉండటాన్ని అనులోమవిలోమ పద్యం అంటారు
అదే కందపద్యంమైతే అనులోమవిలోమ కందపద్యం
అంటారు. గోపీనాథరామాయణములోని
ఈ అనులోమవిలోమ కందం చూడండి-

పావనమానస వసువర
మావన నవసారసనయనాజసుతవిభా
భావితసుజనాయనసర
సావననవమారవ సువసనమానవపా

ఈ పద్యం మొదటినుండి చివరికి చదివితే
ఎలాగుంటుందో చివరనుండి మొదటికి చదివినా
అలాగే ఉంటుంది చూడండి

Thursday, November 30, 2017

తలలోపలనున్న కల్లుద్రావి రనేకుల్


తలలోపలనున్న కల్లుద్రావి రనేకుల్




సాహితీమిత్రులారా!



సమస్య-
తలలోపలనున్న కల్లుద్రావి రనేకుల్


కొప్పరపు సోదరుల పూరణ-

బలు వేసవి దినములలో
గలగిన తాపంబు దీఱగా నుత్సాహం
బొలయగ గడుజల్లని ముం
తలలోపలనున్న కల్లుద్రావి రనేకుల్

తలలోని కల్లు త్రాగటం విరుద్ధార్థం కదా
దాన్ని కవి ముంతలలోని కల్లు అని మార్చారు
దీనితో సమంజసమైనది

Tuesday, November 28, 2017

చుక్కలు పుట్టికన్పడెను సూర్యునితోడ విహాయసంబునన్


చుక్కలు పుట్టికన్పడెను సూర్యునితోడ విహాయసంబునన్




సాహితీమిత్రులారా!


సమస్య- 
చుక్కలు పుట్టికన్పడెను సూర్యునితోడ విహాయసంబునన్


కొప్పరపు సీతారామ ప్రసాదరావు గారి పూరణ-

ఇక్కగ వేదసంహిత గణింపగ మూవురు వేల్పు పెద్ద లీ
యొక్కెడనన్ సమస్తమున కోపిన వేయివెలుంగు ఱేడు త
న్నుక్కి నలార్ప రాహుగ్రహణోద్ధతి పట్టపవల్ వెలుంగు మై
చుక్కలు పుట్టికన్పడెను సూర్యునితోడ విహాయసంబునన్


ఇందులో చుక్కలు సూర్యుడు ఆకాశంలో కనిపించాయనే విరుద్ధార్థం
కనిపిస్తున్నది దీన్ని కవిగారు మైచుక్కలు అనడంతో సవ్యమైంది.

Sunday, November 26, 2017

దత్తపది


దత్తపది



సాహితీమిత్రులారా!

మాడుగుల నాగఫణిశర్మగారి
అవధానం నుండి చూడండి-



Saturday, November 25, 2017

చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై


చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 




సాహితీమిత్రులారా!



సమస్య -
చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 
(ఇది 1961 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ పత్రికలో
సమస్యాపూరణం క్రింద ఇచ్చినది.)

ధవళేశ్వరం వాసి అనూరాధగారి పూరణ-

సురుచిరకౌముదీనిశను సోగపు కన్నులచిద్విలాస బం
ధుర వికచోత్పలప్రభలు తూగగ ముగ్ధ మనోనురాగ మా
ధురులొలికించి "నావలపుతోటకు నామనివంచు" ధార్మికా
చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 

ఇందులో చరణంతో నాథునికి సపర్యలు చేసినట్లనిపించినా
పూరణలో ధార్మికాచరణ - గా మార్చటం వలన ఇందులోని
సందేహం విడిపోయింది.

Thursday, November 23, 2017

8 కాళ్ళతో ఉన్న 800 సంవత్సరాల శిల్పం


8 కాళ్ళతో ఉన్న 800 సంవత్సరాల శిల్పం




సాహితీమిత్రులారా!

నాలుగు శిల్పాలను ఒక శిల్పంగా
మలచిన శిల్పం ఇందులో
నలుగురు యువతులుగా
ఉన్న ఒకేయువతి. దాని వివరణతేకూడిన
వీడియో ఇక్కడ చూడండి-
ఇది గర్భచిత్రం క్రిందికి వస్తుంది