Saturday, November 25, 2017

చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై

చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 

సాహితీమిత్రులారా!

సమస్య -
చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 
(ఇది 1961 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ పత్రికలో
సమస్యాపూరణం క్రింద ఇచ్చినది.)

ధవళేశ్వరం వాసి అనూరాధగారి పూరణ-

సురుచిరకౌముదీనిశను సోగపు కన్నులచిద్విలాస బం
ధుర వికచోత్పలప్రభలు తూగగ ముగ్ధ మనోనురాగ మా
ధురులొలికించి "నావలపుతోటకు నామనివంచు" ధార్మికా
చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 

ఇందులో చరణంతో నాథునికి సపర్యలు చేసినట్లనిపించినా
పూరణలో ధార్మికాచరణ - గా మార్చటం వలన ఇందులోని
సందేహం విడిపోయింది.

No comments: