Tuesday, November 17, 2026

నారాయణీయములోని ద్వ్యక్షరి, ఏకాక్షరి పద్యాలు

 నారాయణీయములోని ద్వ్యక్షరి, ఏకాక్షరి పద్యాలు


సాహితీమిత్రులారా!


అడుసుమిల్లి నారాయణ రావు గారి నారాయణీయములోని ద్వ్యక్షరి పద్యాలు గమనించండి

ద్వ్యక్షరి (న, మ -లతో)

నీనామ మననమును, నే

మానను నామనమున –  ననుమానమ్ము న్నే

నీనామమె నానామము

నానీమము మామ మామ నమ్ముము మనుమన్.

"నీ నామ స్మరణను నా మనసులో ఎన్నటికీ మానను. నీ నామమే నా నామము (నా సర్వస్వము). ఇందులో అనుమానం లేదు. నా నియమమును, నన్ను నీవాడిగా నమ్ముము" అని దీని భావం.

 

ద్వ్యక్షరి

వెరవరి-  రా, వెవ్వార

వ్విరివి విరి విరవిరవోవ వెరువురుపూరన్

వరరవరావౌ - రావె

వ్వరి వర విరు వరి విరివరవరరారావౌ.

(వెరవరి) ఉపాయ శాలి రావు 2) ఎవ్వారు+ఆవిరివి+విరి ఎవ్వరు+ఆవికసించిన పూవు విరవిరవోవ=విలవిలలాడునట్లు. వెరువురువు+ఊరన్=ఊరినించి వెడలించగలరు. 8) వర, రవరావౌ=రావన (వర) శ్రేష్టమైన (రపు రవ్వ 4) రావు+ఎవరి+వరవు? - ఎవరి సేవకుఁడు? ఇ1రువు+అరి+విరివి+అ2రవర + రా3 + రావ్,

1(స్థానము)  2(తునక లై)  3(పోగా) రావు ఎవ్వరి సేవకుడు గాడు.

ఇది స్వస్థానము శత్రువులు ముక్కలుముక్కలు కాగా రావయ్యే,

----------------------------------------------------------------------------------------------------------------

కాకోల కాక కాకలు

కోకిల కుల లీలలు కులుకుల్ కొలకులలో

కేకుల లుకలుకలలుకలు

కాళి కులుకులకింక కొంకకు కలికీ! 

--------------------------------------------------------------------------------------------------------------

ఏకాక్షరి - ప- అనే వ్యంజనంతో

  పాపా! పాపీ! పో! పా

పా! పాపపుపాప, పూప, పప్పే, పప్పే!

పాపీ! పీపా పాపై

పోపో, పప్పాపిపోపొ, పూపా! పాపా!

 పాప, పాపీ (యిద్దరు బిడ్డలు) పాముపిల్ల నుండి తప్పు కొని పీపాపక్కకుఁ బొమ్మనుచు బాధపడుట. పాపా! + పాపీ! + పో + పాపా + పాపపు పాప + పూప (పిండి వంట) + పప్పు + ఏ + పప్పు + ఏ (పూప, పప్పు పప్పులతో రమ్మని పిల్చుట), పాపీ (పాపిష్టిదానా) పీపా + పాపై (ప్రాపై) + పోపో + పప్పు + ఆపి + పోపో, వూపా, పాపా. బిడ్డా! బిడ్డా!

"పాపా! పాపీ! (పిల్లల పేర్లు) వెళ్ళండి. ఓ పాపపు పిల్లలారా, పూప (పిండివంట), పప్పు తిందురు గాని రండి. ఓ పాపిష్టిదానా! ఆ పీపాను ఆశ్రయించి వెళ్ళిపో. పప్పు తిని త్వరగా వెళ్ళిపో." అని దీని అంతరార్థం.

Tuesday, November 3, 2026

ఉమామల్లేశ్వర శతకములోని నిరోష్ఠ్యము

ఉమామల్లేశ్వర శతకములోని నిరోష్ఠ్యము


సాహితీమిత్రులారా!


విప్పర్తి శ్రీరాములు
కూర్చిన ఉమామల్లేశ్వర శతకంలోని నిరోష్ఠ్య సీసపద్యాలు-

నిరోష్ఠ్యము అంటే పెదవులు తగల కుండా చదివే పద్యాలు

గమనించండి-