Wednesday, December 28, 2016

ఆకుంటే వృక్షంబగు


ఆకుంటే వృక్షంబగు
సాహితీమిత్రులారా!గోల్కొండను పాలించిన ఇబ్రహీం కుతుబ్ షాహి ని
మన తెలుగు కవులు మల్కిభరాముడని కీర్తించారు.
ఒకమారు మల్కిభరాముడు ఇచ్చిన ఈ పదాలతో
సమస్యపూరణ చేయవలసిందిగా కోరగా ఒక కవి
పూరించిన పద్యం-

ఆకు, ఈక, మీకు, మాకు - అనే పదాలు
వచ్చేవిధంగా పద్యపూరణ చేయమన్నారు

పూరణ -
ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే లోభియౌను హీనాత్ముండౌ
మీకుంటే మాకీయుడు
మాకుంటే మేమురాము మల్కిభరామా!No comments: