Tuesday, December 20, 2016

నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమా!


నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమా!
సాహితీమిత్రులారా!


సమస్య -
మంగలవాడు నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమా!


ఈ సమస్య లక్ష్మీదేవిని సంబోధిస్తూ పలికింది.
వినగానే అసంగతార్థం స్ఫురిస్తుంది.
పూరణ శతావధాన ప్రబంధము
ప్రథమ ఖండము నుండి-

పూరణ -

సంగతశంఖచక్రముఖసాధన భీషణమూర్తి, యార్తి భి
న్మంగళదాయి చారుకరుణాశుభవీక్షణుడు జ్జ్వలాంబు భృ
త్తుంగవిలాససంహననధూర్వహు డవ్యయుడీ త్రిలోకి నో
మం గలవాడు నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమా

ఇందులో మూడవపాదంలో
అవ్యయుడు + ఈత్రిలోకిన్+ ఓమన్ + కలవాడు
అని సంధి కలిపి పూరించాడు దీనివల్ల ఉన్న సందర్భం
తొలగిపోయి రమ్యంగా మారింది.
త్రిలోకిన్ =  ముల్లోకములను,
ఓమన్ + కలవాడు =  ఓమంగలవాడు
అంటే కాపాడగలవాడు అని అర్థం.


మీరునూ మరోరకంగా ప్రయత్నించి పూరించి పంపగలరు

No comments: