Thursday, December 15, 2016

ఏకాక్షర నిఘంటువు - 11


ఏకాక్షర నిఘంటువు - 11



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి......



- వాయువు, పర్వతము, ప్రకాశము, కౌస్తుభము,
         క్షణము, శుభలగ్నము.

పమ్ -  బంగారము, పానముచేయువాడు, నీటిధార,
             సమ్మతి, ఆపన్నుడు, కోపశూన్యుడు.

పః - పరమాత్మ, పానము, పవనము, పతనము, పవిత్రము,
           పాపనాశకరము, పంచమస్వరస్థానము, కుబేరుడు,
           పడమటి దిక్కు, పాలించివాడు.

పాః -  పాలనకర్త, పవిత్రము, పూరితము, బూరుగుచెట్టు,
             తీగసంకెల, నిర్మలమైనది.

పా - రక్షించుట, త్రాగుట, పీల్చుట.

పుం - పురుషుడు,  పరమాత్మ.

పూ - పూవు, శిద్ధి, పవిత్రము.

పూర్ - పురము, శరీరము, పూరించుట.

పణ్ - వ్యవహారము చేయుట, స్తోత్రము చేయుట.

పత్ - పడుట, దిగుట, క్రిందికి వచ్చు, ఎగురుట.

పద్ - పాదము, అడుగు, నాల్గవభాగము.

ప్ర - ప్రాధాన్యము, అతిశయించుట.

ప్లు - ఈదుట, తేలుట, నావచే దాటుట, ఎగురుట, జారుట.

- గాలితోకూడిన వాన, భుజమును తట్టుట, ఫూత్కారము,
        నివారించుట, యుద్ధము. పిలుచుట

ఫః - అభివృద్ధి, కఠినోక్తి, నిరర్థక సంభాషణ,
           వాతము, కఫము, విస్తారమైన, మరుగైన.

ఫాః - వృద్ధి, వర్ధకము, సంతాపము, వ్యర్థవాక్యము.
             16వ భాగము,  ఆట, గుడిసె.




No comments: