Thursday, December 1, 2016

మతాం ధునానారమతామకామతా


మతాం ధునానారమతామకామతా




సాహితీమిత్రులారా!


ఈ యమకభేదం చూడండి-

మతాం ధునానారమతామకామతా
మతాపలబ్ధాగ్రి మతానుమలోమతా
మతావయత్యుత్తమతా విలోమతా
మతామ్యత స్తే సమతా న వామతా

దీని పదవిభాగము-
మతాం, ధునానా, ఆరమతాం, అకారమతాం, అతాపలబ్ధా,
అగ్రిమతానులోమతా, మతౌ, అయతీ, ఉత్తమతా విలోమతాం,
అతామ్యత:, తే, సమతా, న, వామతా.

(ఆత్మారాములైన యోగులయొక్క అనభిలాషిత్వమును
చెదరగొట్టినదియు, అనాయాసముగా లభించినదియు,
శ్రేష్ఠత్వమునకు అనుకూలమైనదియు,
ఉత్తమత్వముయొక్క విలోమత్వమును
బుద్ధియందు చేరనీయనిదియునైన
సమతయే అతామ్యుడనైన(చిత్తగ్లాని ఎరుగని)
నీకు సమ్మతము. విషమత్వము(వామత) సమ్మతముకాదు)


మతాం ధునానారమతామకామతా
మతాపలబ్ధాగ్రి మతానుమలోమతా
మతావయత్యుత్తమతా విలోమతా
మతామ్యత స్తే సమతా న వామతా

దీనిలో వ్యపేతానుచ్ఛేదనముచేతనే పాదసంధులయందు
అవ్యపేతము పుట్టుచున్నది. కావున ఇది సూక్ష్మావృత్తి యొక్క
అస్థానయమకము. దీన్ని సంధి సూక్ష్మావ్యపేత యమకము అంటారు.

దీనిలో మతా - అనే రెండక్షరముల గుచ్ఛము
ప్రతి పాదమునందు ఆది, మధ్య, అంతములందు
వచ్చుచున్నది. నడుమ ఇతర అక్షరముల వ్యవధానము కలదు.
ఇందులో ఆది మధ్య అంతములందు వ్యవధానము కలదు.
అదే విధంగా పాదాంత పాదాదులందు వ్యవధానము లేదు
ఈ విధంగా ఇది అవ్యపేతము. నిజానికి ఇది వ్యపేతమైన
అక్షరగుచ్ఛములచేతనే అవ్యపేతయమకము సంభవిస్తున్నది.
ఇందులో వ్యపేతము అవ్యపేతము రెండును అంగీకరించబడుచున్నవి.
అందువల్ల దీన్ని అస్థానయమకంగా పరిగణింప బడుచున్నది కావున దాన్ని అన్యభేదానుచ్ఛేదనముతోడి సూక్ష్మమునకు ఉదాహరణ అగుచున్నది ఈ శ్లోకము.

No comments: