Thursday, December 1, 2016

కోతివొ పిల్లివొ భూతపిల్లివో?


కోతివొ పిల్లివొ భూతపిల్లివో?




సాహితీమిత్రులారా!


శ్రీనాథమహాకవి సర్వసింగభూపాలుని సభకు
వెళ్ళిన సందర్భంలో ఒక పండితుడు
శ్రీనాథునికి ఇచ్చిన సమస్య-

కుక్కవొ ఫణివొ నక్కవో కోతివొ పిల్లివొ భూతపిల్లివో?

ఈ పద్యపాదం చదువుతూ
ఆయనవైపే చూస్తుంటే
ఆయన్నే తిట్టినట్లుందట.
నువ్వు కుక్కవో, పామువో, నక్కవో,
కోతివో, పిల్లివో భూతపిల్లివో - అని.

శ్రీనాథుడు చిరువ్వుతో
ఒకసారి అతనివైపు చూసి
పద్యాన్ని ఇలాపూరించాడు-

తక్కకరావు సింగ వసుధావరు డర్థుల కర్థమిచ్చుచో
దిక్కుల లేని కర్ణుని దధీచిని ఖేచరు వేల్పుజెట్టు పెం
పెక్కిన కామధేనువు శిబీంద్రుని నెన్నెదు భట్ట దిట్టవై
కుక్కవొ ఫణివొ నక్కవో కోతివొ పిల్లివొ భూతపిల్లివో?

సింగభూపాలుడు యాచకులకు దానం చేస్తుంటే
ఎందుకయ్యా ఎప్పటి వారినో కర్ణుని, దధీచిని,
కల్పవృక్షాన్ని, కామధేనువును, శిబిని ఎన్నుతావు
నువ్వు కుక్కవో, పామువో, నక్కవో, కోతివో, పిల్లివో,
భూతపిల్లివో - అని
అడిగినవానికే బాణం వదిలాడు.
దీనితో సింగభూపాలుడు పొంగిపోయినాడట.

(భూతపిల్లి అంటే గ్రామాల్లో అర్థరాత్రి వేళ పూజలు చేసి
దిగంబరుడై రక్తన్నం పొలిమేర దగ్గర బలి వేసేవాడు)

No comments: