Tuesday, December 13, 2016

ముండను వీక్షించి మురిసె మునివరుడటవిన్


ముండను వీక్షించి మురిసె మునివరుడటవిన్




సాహితీమిత్రులారా!


సమస్య -
ముండను వీక్షించి మురిసె మునివరుడటవిన్

పూర్వకవి పూరణ -

చండతరనియమ మెసగ న
ఖండ చపం బాచరింపగా దన కోర్కుల్
నిండగ బ్రసన్నయగు చా
ముండను వీక్షించి మురిసె మునివరుడటవిన్

ఇందులో కవి ముండను కాక చాముండను అని
మార్చడం వలన సవ్యమైన అర్థంలోకి మారి
ఆహ్లదాన్ని కలిగిస్తున్నది.

మిక్కిలి కఠినమైన నియమాలతో,
అఖండమైన తపస్సు చేసి,
తన కోరిక నెరవేరునట్లుగా
ప్రసన్నురాలై తన ఎదుట
సాక్షాత్కరించిన చాముండాదేవిని
చూచి ఆ ముని ఎంతో సంతోషించాడు -
అని భావం.

No comments: