Monday, December 5, 2016

ఏకాక్షర నిఘంటువు -1


ఏకాక్షర నిఘంటువు -1



సాహితీమిత్రులారా!

ఏకాక్షర నిఘంటువు అందరికి అందుబాటులో
ఉండేందుకు చిరుప్రయత్నం-
అందరు ఉపయోగించుకొంటారని .....


- బ్రహ్మ,విష్ణువు, శివుడు, తాబేలు, ముంగిలి, యుద్ధము,
        గొప్ప తనము, అంత:పురము, హేతువు, భూషణము,
       పాదము, పార్వతి, యజ్ఞము, చంద్ర బింబము, గాయత్ర్యాది
       మంత్రము, చక్రము, కోడితల, బృహస్పతి, గాలి, సిగ, గుఱ్ఱము
       మొదలైనవి.
అ: - సిద్ధమంత్రము, సూర్యాశ్వము, చంద్రబింబము, కోడితల,
         పగ్గము, సిగ. బ్రహ్మ, నారాయణుడు, పరమేశ్వరుడు,
         ఒక రౌద్రబీజము, మృత్యునాశక బీజాక్షరము.

అమ్ - ఆకాశబీజము, విష్ణుబీజము, వృక్షబీజము, వంశీకరణ బీజము,
              హేతువు, భూషణము, స్వల్పము, త్వర, వంకర మాట, దోసిలి,
              అనుస్వారము, బిందువు, ముంగిలి, యుద్ధము,
              అంతిపురము, పాదము.
- స్థానము, భావము, పరితాపము, బ్రహ్మదేవుడు, కోపము,
        తలంపు, వాక్యపూరణ, ఆక్షేపము, ఆశ్చర్యము, సంతోషము,
        వైరాగ్యము, ప్రభావము, సంబోధనము, బలము, కడవ, బరువు,
       పూజ, తాత, మంగళసూత్రము.
ఆ: - స్థానము, భావము, సంతాపము, బ్రహ్మ, శివుడు, కోపము,
          ఆక్షేపము, తలపు, అచ్చెరువు, సంతసము, విరాగము, ప్రబోధము,
          సంబోధనము, బలము, బరువు, కడవ, పూజ, తాత, మంగళసూత్రము,
         దుఖము, శమము, సదాచారము, ముఖము, ఉనికి.

ఆమ్ - అంగీకారము, స్మరణ, నిశ్చయము, జవాబు, పాశము,
               ఒక ఆకర్షణీయ బీజము.

ఙ్ - స్వల్పము. వరకు, గ్రహించుట, కప్పుట, పూరించుట,
            కోపగించుట, కౌగిలించుట, తిట్టుట, కోరుట, కాలక్షేపము,
            వేడుక, దగ్గర, వంచనము,  బంధము, నిరోధము, విరోధము,
            సంహారము, స్నానము, వాడుక, చూచుట, హద్దు, ఆలోచించుట,
            బుద్ధి, ఈవి, పరాధీనము, భూషణము, సంభాషణ, ఎదురు,
           ఆక్రమణము, జీవనోపాయము, మరుపు, నమ్మిక, ప్రయత్నము,
           భోజనము, సంబోధనము, పూజ, బడలిక, వాత్సల్యము, సంచయము.
      

No comments: