ఏకాక్షర నిఘంటువు - 26
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ష - స్వర్గము, దేశము, లక్ష్మి, గర్భము, మోక్షము,
అవసానము, ఓర్చుట, పరోక్షము, శ్రేష్ఠము.
షః - స్వర్గము, కేశములు, పరోక్షము, శ్రేష్ఠము, నేర్పరి,
పండితుడు, తుది, నాశము, ముక్తి, కాన్పు, తెలిసినది,
గంభీర దృష్టిశాలి, ఉపద్రవము, ఎదురుగా.
షమ్ - ధర్మార్థ కామసిద్ధిదమగు ఒక పరిశుద్ధ బీజాక్షరము,
తడిద్భీజము, గర్భము, మోక్షము, తుద.
షట్ - ఆరు వస్తువులు
స - గౌరీపుత్రుడు, వాయువు, శరీరకాంతి, రథ మార్గము,
జ్ఞానము, ధాన్యము, నివారణము.
సః - ఏడు స్వరాలలో మొదటిది, సర్పస్థానము,
విఘ్నేశ్వరుడు, వాయువు, బుధుడు, ఈశ్వరుడు,
పాము, పక్షి, విష్ణువు, వాడు, సగణము, కోపము,
హంస బీజము, ప్రాకారము.
సమ్ - సుందరము, సమము, కలయిక, లెస్సగా,
మిక్కిలి, వృద్ధి, సముచ్ఛయము, సర్వకారణము,
సమస్త వర్ణాత్మకమగు ఒక బీజాైక్షరము, శక్త్యాత్మక
సుఖాత్మకబీజము, జ్ఞానము, ధ్యానము, భేధములేనిది.
సత్ - నక్షత్రము, బ్రహ్మ.
సన్ - కాలము, సత్యము, విద్వాంసుడు, శ్రేష్ఠుడు,
సత్పురుషుడు, పూజ్యుడు.
సహ్ - సహించుట, ఓర్చుట
సృ - పోవుట
సృజ్ - వదులు చేయుట, సృష్టించుట