Friday, November 25, 2016

మధురవాణీ విలాసములోని చిత్రకవిత


మధురవాణీ విలాసములోని చిత్రకవిత




సాహితీమిత్రులారా!


మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్షర , ద్వ్యక్షర   త్య్రక్షర - పద్యాలను చూడండి-

ఏకాక్షరకందపద్యం-

'న'- అనే ఒకే హల్లుతో కూర్చిన కందము.

నిన్నే నెన్నేనని నే
నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్
నన్నానును నాననాను నననీనన్నా (2-11)

ద్వ్యక్షర కందము-

'న', 'క' - అనే హల్లులుపయోగించి కూర్చినది.

నానా నాకౌకోనీ
కేనాకన నిన్నెకాక నికనేనొకనై
నానెన్ని కినుక నూనక
కానుకకైకొన్న నిన్ను కన్నా నికఁనే (2-12)


న,మ - అనే రెండు హల్లులతో
కూర్చిన ద్వ్యక్షరకందం-

నేమమ్మున నీనామము
మామనమున నమ్మినాము మము మనుమను మో
మామానినాన నెమ్మిని
మే మనుమానమ్ముమాన మి మ్మెన్నేమా (2-13)


త్య్రక్షరకందము-

ద,న,వ- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దానవవనదవవనదా
నానావిద్వన్నవీన నవననిదానా
దీనానాదీనవదా
నానుదు నెద నీదువాదు నాదవినోదా (2-14)

ఈ కావ్యంలోని మరికొన్ని విషయాలను
తరువాత తెలుసుకొందాము.

No comments: