Thursday, November 24, 2016

భూపాలుండ రక్షించవే


భూపాలుండ రక్షించవే



సాహితీమిత్రులారా!


కామినేని మల్లారెడ్డి గారి షట్చక్రవర్తి చరిత్రలోని
కార్తవీర్యార్జునుని కథలో తన తండ్రి యనంతరము
రాజ్యభారము వహించుటకు కార్తవీర్యార్జునుడు
ఇష్టపడలేదు. గర్గుని బోధనవలన దత్తాత్రేయుని
సేవించడాని వెళ్ళాడు. నిరంతరము మదవతీలోలుడును,
మద్యపానరతుడు అయి కాలము బుచ్చుతున్న దత్తాత్రేయ
యోగిని, కార్తవీర్యార్జునునకు మధ్యజరిగిన సంభాషణ చిత్రం ఇది.


ఓరీ యర్భక, నీ వదెవ్వఁడవురా ఓ సామి, భూభృన్మణిన్
మేరుగ్రావమవో మహాత్మ యినుఁడన్ నీరేజమిత్రుండవో
కారుణ్యాకర, రాజ శీతఘృణివో కానయ్య, యీ ధరుణీ
భారం బూనిన కార్తవీర్యుడను భూపాలుండ రక్షింపవే
                 (షట్చక్రవర్తి చరిత్ర 8-28)

దత్తాత్రేయుడు- ఓరీ! యర్భక, నీ వదెవ్వఁడవురా? 
కార్తవీర్యుడు - ఓ సామి, భూభృన్మణిన్
దత్తాత్రేయుడు- మేరుగ్రావమవో? 
కార్తవీర్యుడు- మహాత్మ యినుఁడన్ 
దత్తాత్రేయుడు - నీరేజమిత్రుండవో?
కార్తవీర్యుడు- కారుణ్యాకర, రాజ 
దత్తాత్రేయుడు- శీతఘృణివో? 
కార్తవీర్యుడు- కానయ్య, యీ ధరుణీభారం బూనిన 
                    కార్తవీర్యుడను భూపాలుండ రక్షింపవే

No comments: