Thursday, November 3, 2016

కాంచిల్లునీతే సురతశ్రమార్తిమ్


కాంచిల్లునీతే సురతశ్రమార్తిమ్



సాహితీమిత్రులారా!



యమకము ప్రధానంగా
అవ్యపేత వ్యపేత యమకములని
వీటిలో అవ్యపేత యమకమునుగురించి
కొన్నిటిని తెలుసుకున్నాము. ఇక్కడ
వ్యపేతయమకం గురించి తెలుసుకుందాము.

వ్యపేతం అనగా దూరదూరంగా ఉంచబడినది అని అర్థం.
నాలుగుపాదాలలోనూ యమకం దూరదూరంగా పాదం
మొదటిలో ఉంటే దాన్ని చతుర్పాద వ్యపేత ఆదియమకం
అంటారు. దానికి ఉదాహరణ-


కాంచిప్రతోలీ మనుకామినీనాం తాం
కాంచి స్రవంతీవనమాతరిశ్వా
కాంచి ప్రభృత్వాభరణోజ్ఝితానాం
కాంచిల్లునీతే సురతశ్రమార్తిమ్
                                          (సరస్వతీకంఠాభరణమ్ - 2-108)



కాంచీనగరపురాచబాటను
అనుసరించెడి మొలనూలు
మొదలయిన ఆభరణములను
విడిచిపెట్టిన కామినులయొక్క
సురతశ్రమార్తిని జలములచే
నొప్పుచున్న ప్రవాహముగల
వనమందలి వాయువు పోగొట్టుచున్నది - అని భావం.

కాంచిప్రతోలీ మనుకామినీనాం తాం
కాంచి స్రవంతీవనమాతరిశ్వా
కాంచి ప్రభృత్వాభరణోజ్ఝితానాం
కాంచిల్లునీతే సురతశ్రమార్తిమ్


దీనిలో "కాంచి" అనే అక్షరగుచ్ఛము
ప్రతి పాదంలో వచ్చింది.
అదీ ప్రతిపాదం మొదట్లోనే ఉంది.
 కావున ఇది ఆదియమకం అవుతుంది.
అలాగే మొదటి కాంచి- కి,
రెండవ కాంచి-కి నడుమ చాల
ఎడమ ఉన్నందున
ఇది వ్యపేతయమకం అగుచున్నది.

No comments: