Wednesday, November 9, 2016

కాముకీం సురత ప్రియామ్


కాముకీం సురత ప్రియామ్



సాహితీమిత్రులారా!


అజితసేనుని 
అలంకార చింతామణి లోని
ఈ శ్లోకం చూడండి

కాముక: శ్రయతే నిత్యం 
కాముకీం సురత ప్రియామ్
కాన్తాననే! - వ దేదానీం 
చతురక్షర విచ్యుతిమ్

                     (అలంకారచింతామణి-2-146)

కాన్త + ఆననే = అందమైన ముఖం గలదానా!
కామియగు పురుషుడు సంభోగ ప్రియురాలగు
కామినిని సదా ఆశ్రయించుచున్నాడు.
నీవిప్పుడు  దీని మూడు పాదాలలోని
నాలుగక్షరములను తొలగించి,
జాగ్రత్తగా ప్రత్యుత్తరమివ్వు.

ఈ శ్లోకంలోని మూడుపాదాలలోని పదాలను
ఈ విధంగా రెండవ అక్షరం తొలగిస్తే అంటే-
కాముక: -లో ము తొలగించిన కాక:
సురతప్రియాం- లో తొలగించిన సుతప్రియాం
కాముకీం - లో ము తొలగించిన కాకీం
కాన్తాననే - లో న్త తొలగించిన కాననే
అంటే ఈ విధంగా ఏర్పడినవి
కాక: సుతప్రియాం కాకీం కాననే -
కాకి- సంతానోత్పత్తిగోరి-
ఆడుకాకిని- అడవిలో ఎల్లప్పుడు
అనుభవించుచున్నది - అనే అర్థం ప్రత్యుత్తరంగా
అగుచున్నది.

దీనికి ఇంకా కొన్ని విరణలున్నాయి.
మరోమారు చూద్దాం.

No comments: