Tuesday, November 8, 2016

గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్


గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్




సాహితీమిత్రులారా!


సమస్య-
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

కందుకూరి రుద్రకవి పూరణ-

ఉండ్రా ఓరి దురాత్మక
ఈండ్రా ప్రాసంబు కవుల కియ్యం దగునా?
అండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

దీనిలోనూ కవిగారు మొదటి రెండుపాదాలు
ప్రాసనుగురించి చెబుతూ
అర్థవిమర్శ మూడవపాదంలో
రాముని పదము సోకిన గుండ్రాయి(అహల్యగా మారి)
కాళ్ళువచ్చి గునగున నడిచిందని పూరించాడు.


ఆసక్తిగల వారు మరోరకంగా పూరించి పంపగలరు

పంపేవిధానం-
మీరు కామెంట్ అనే చోటినుండి పంపాలి.
లేఖిని ద్వారా టైపు చేసి అందులోనుండి 
కాపీ చేసి కామెంట్ నందు పేస్ట చేసి పంపవచ్చు.

No comments: