Sunday, June 5, 2016

ద్విపాది


ద్విపాది


సాహితీమిత్రులారా!

పద్యమంతా ఒకే పాదం అంటే పద్యం నాలుగు పాదాలు
ఒకే పాదం ఆవృత్తమైన అది ఏకపాది అని తెలుసుకొనియున్నాము.
అలాకాక పద్యంలో రెండుపాదాలు ఆవృతమైన అది ద్విపాది అని పిలుస్తారు.
ఆ రెండు పాదాలు 1,2 ఒకలా, 3,4 పాదాలు మరొలా గాని,
1,3 ఒకలా, 2,4 పాదాలు మరొలా గాని రావచ్చు.
ఇప్పుడు ఈ పద్యం 1,3 సమానంగాను,
2, 4 సమానంగాను ఉన్నది
గమనించండి.

తగిన మగవాని కౌగిట తగిలినట్టి
అలిచికుర యౌవనంబది యౌవనంబు!
తగని మగవాని కౌగిట తగిలినట్టి
అలిచికుర యౌవనంబది యౌవనంబు!!


 ఈ పద్యంలో చిన్న మార్పు తప్ప ఏమిలేదు అనిపిస్తుంది.
1వపాదంలో తగిన - అని 3వ పాదంలో
తగని - అని విరోధాభాసము.
ఇక అర్థంలోకెళితే.....
తగిన మగవాని పొందిన దాని యౌవనమే యౌవనము.
తగని మగవాని పొందిన యౌవనము యౌ - వనము
అంటే వనం(అడవి)పాలు అనికదా!
అరణ్యముతో సమానం.
బాధాకరం - అని భావం.

No comments: