Friday, January 22, 2021

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం - 8

 కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం - 8




సాహితీమిత్రులారా!

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని ఎనిమిదవ శ్లోకం-

జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా

రంభా కరీంద్ర కర దంభాపహొరుగతి డింభానురంజిత పదా 

శంభా ఉదార పరిరంభాంకురత్ పులక దంభానురాగ పిశునా

శం భాసురాభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా || 8 ||


ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -



Wednesday, January 20, 2021

గోమూత్రికాబంధం

గోమూత్రికాబంధం




సాహితీమిత్రులారా!



కొడవలూరి రామచంద్రరాజుగారి

మహాసేనోదయం నుండి

ఈ గోమూత్రికాబంధం ఆస్వాదించండి-

 

సురనరవరపరిపాలా
శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా
మరపరహర భరితైలా
హర విధిశర్వాణివినుత యార్యనిధానా 

                                                                                            (2- 253)

దీనిలో పూర్వర్థము పొడవుగా వ్రాసి
దానిక్రింద ఉత్తరార్థం వ్రాయగా
ఈ విధంగా వస్తుంది-

సురనరవరపరిపాలా శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా

మరపరహర భరితైలా హర విధిశర్వాణివినుత యార్యనిధానా


ఇపుడు ప్రతి పాదములో 2,4,6,8,10,12,14 అక్షరాలను
అంటే సరిసంఖ్యలోని అక్షరాలను గమనిస్తే
రెండింటిలోనూ ఒకే వర్ణం ఉన్నట్లు గమనించగలం.

సురనరవరపరిపాలా    శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా

మరపరహర భరితైలా హర విధిశర్వాణివినుత యార్యనిధానా



దీన్ని ఈ క్రిందివిధంగా వ్రాయడం వలన 
గోమూత్రికా బంధమవుతుంది -



Monday, January 18, 2021

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం - 7

 కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం - 7



సాహితీమిత్రులారా!

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని ఏడవ శ్లోకం-

న్యంకాకరె వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే

త్వం కామనా మయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిరిజామ్ |

శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో

ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమ

లామ్ || 7 ||


ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -



Saturday, January 16, 2021

పుష్పమాలికాబంధం

 పుష్పమాలికాబంధం




సాహితీమిత్రులారా!


కొడవలూరు రామచంద్రరాజు కృత

మహాసేనోదయం నుండి 

పుష్పమాలికాబంధం

ఆస్వాదించండి-

జనకనరేనజాస్య జలజన్మజగద్దృశ కాశభేశచం
దనవనఫేనకీర్తి నగనన్దనసేవ్యపదాపదాపహా
వినయనదీనతుల్య విలువిద్యవిభాసిత పాతకాంతకా
బ్జనయన దానశౌండ పరిపన్దిపలాశన కానవానలా


ఈ మాలలో 12 పుష్పాలున్నాయు.
ఒక్కొక పుష్పంలో 7 అక్షరాలున్నాయి
మొదటి పుష్పంలో ఈ లాగున్నాలిచూడండి-
                          జ
               రేనక
                  జా

దీనిలో 5 అక్షరాలే కనిపిస్తాయి
కాని చదవడంలో 7 అక్షరాలోస్తాయి
జనకనరేనజా - ఇందులో 7 అక్షరాలున్నాయి కదా
ఇలాగే ఏడు రెండ్ల 14 అక్షరాలు
తగ్గిపోతాయి ఈ బంధరచనవల్ల
పద్యం చూస్తూ బంధచిత్రాన్ని చదవండి
అంతా తెలిసిపోతుంది.







Thursday, January 14, 2021

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం - 6

 కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం - 6



సాహితీమిత్రులారా!


కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని ఆరవ శ్లోకం-

దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమ నో

వాసా విపంచి కృత రాసా విధూత మధు మాసారవింద మధు రా |

కాసార సూన తతి భాసాభిరామ తను రాసార శీత కరుణా

నాసా మణి ప్రవర భాసా శివా తిమిర మాసాయె దుపరతిమ్ || 6 ||


ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -




Tuesday, January 12, 2021

ఖడ్గబంధం

 ఖడ్గబంధం




సాహితీమిత్రులారా!

శ్రీకొడవలూరు రామచంద్రరాజు కృత

మహాసేనోదయములోని ప్రథమాశ్వాసములోని

ఈ పద్యం ఖడ్గబంధంలో కూర్చబడినది-
చూడండి-

పురహరసురనుతపాదా
కరిదై తేయాసుహర్త కంధినిషంగా
గిరిజాహృదయరంజన
సరసీరుహనాభమిత్ర సమ్మనిసంగా


చిత్రము చదవడం సులభతరం చేయడం కోసం
కవిగారు చిత్రములో పాదము సంఖ్యలు చూపడం
జరిగింది సులువుగా చదువవచ్చు.
పద్యాన్ని చూస్తూ బంధచిత్రం చూచి చదవండి
కవి ఎలా బంధాన్ని రచించారో అవగతమౌతుంది.






స్వామివివేకానందుని జన్మదినశుభాకాంక్షలు

 స్వామివివేకానందుని జన్మదినశుభాకాంక్షలు






సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

స్వామివివేకానందుని జన్మదినశుభాకాంక్షలు