Sunday, January 10, 2021

గిరిబంధం /శైలబంధం

 గిరిబంధం /శైలబంధం





సాహితీమిత్రులారా!

శ్రీకొడవలూరు రామచంద్రరాజు కృత
మహాసేనోదయము నందు గల
గిరిబంధము పద్యం చూడండి-

గిరిబంధములో మొదట 1 అక్షరము,
తరువాత 3 అక్షరములు, 5 అక్షరములు,
7 అక్షరములు, 9 అక్షరములు, 11 అక్షరములు,
11 అక్షరములు ఉండునట్లు కూర్చబడిన చిత్రములో
చూపిన విధంగా వ్రాసిన గిరిబంధము ఏర్పడును.
ఈ విధంగా వ్రాయడం వలన పైనుండి మధ్యలో
కవి పేరుగాని, ఇష్టదేవత పేరుగాని కవి కూర్చును
ఈ పద్యంలో కొడవలూరి రామచంద్రరాజు గారు
తన ఇష్టదైవమైన శ్రీరామలింగేశ్వరుని
నమస్కరించిన విధంగా కూర్చారు.

శ్రీహీరాన్గద కమలద
వాహ నిలింపార్చితాంఘ్రి వనజాగసుత 
స్నేహ మునినిచయవంద్యా
దేహజగర్వాద్రికులిశ దేవసుచరితా



శ్రీ
హీరాన్గ
ద కమలద
     వాహ నిలింపార్చితాం
ఘ్రి వనజాగసుతస్నేహ 
మునినిచయవంద్యాదేహజగ
                          ర్వాద్రికులిశ దేవసుచరితా


Friday, January 8, 2021

కాళిదాసకృత అశ్వధాటీ స్తోత్రం -5

  కాళిదాసకృత అశ్వధాటీ  స్తోత్రం -5



సాహితీమిత్రులారా!

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని ఐదవ శ్లోకం-

కంబావతీవ సవిడంబా గలేన నవ తుంబాభ వీణ సవిధా

బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే 

అంబా కురంగ మదజంబాళ రోచి రిహ లంబాలకా దిశతు మే

శం బాహులేయ శశి బింబాభి రామ ముఖ సంబాధిత స్తన భరా || 5 || 

ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -



Wednesday, January 6, 2021

కాళిదాసకృత అశ్వధాటీ స్తోత్రం -4

 కాళిదాసకృత అశ్వధాటీ  స్తోత్రం -4


సాహితీమిత్రులారా!

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని నాలుగవ శ్లోకం-

బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చెలా నితంబ ఫలకె

కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శొషణ రవిః |

స్థూలాకుచే జలద నీలాకచె కలిత వీలా కదంబ విపినే

శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధి రాజ తనయా || 4 || శా. ||


ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -



Monday, January 4, 2021

పెదిమలతో పలికే పద్యం

 పెదిమలతో పలికే పద్యం





సాహితీమిత్రులారా!



ప - వర్గాక్షరాలు అంటే ప,ఫ,బ,భ,మ - మరియు
అంతస్థానాలలో- వ, అచ్చుల్లో - ఉ,ఊ - మరియు
కంఠోష్ట్యాలు - ఒ,ఓ,ఔ - లు వీటిని ఓష్ఠ్యాలు అంటాము.
వీటితో కూర్చబడే పద్యాన్ని లేదే శ్లోకాన్ని (స + ఓష్ఠ్యం) సోష్ఠ్యం అంటాము.
ఇవి కేవలం పెదిమలతో మాత్రమే పలుకబడతాయి.
కాణాదం పెద్దన సోమయాజి గారి ఆధ్యాత్మరామాయణ
అరణ్యకాండలోని 431వ పద్యం ఇది చూడండి.

భూమాప్రేమ సుభావ గోపయువ సుభ్రూ విభ్రమా విద్భవ
వ్యామోహారు విభావ భావ భవ భావ ప్రాప్త భానూద్భవా
భూమీ పార్శ్వ భవద్రుమ ప్రభ శుభాంభో భృద్విభావైభవా
సోమక్ష్మాప వరోపభావ్య విభవ స్తోమా బహుప్రాభవా!

ఈ పద్యంలో పైన మనం చెప్పుకున్న వాటినుండే
కూర్చబడినదిగా గమనించగలము.
దీనిలో ర, స - అనే హల్లులు ఓష్ఠ్యాలు కాదు
కాని వాటికి చేరిన అచ్చులు ఓష్ఠ్యాలుగా గమనించాలి.

Sunday, January 3, 2021

కాళిదాసకృత అశ్వధాటీ స్తోత్రం -3

 కాళిదాసకృత అశ్వధాటీ  స్తోత్రం -3




సాహితీమిత్రులారా!

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని మూడవ శ్లోకం

యాళీభి రాత్మతనుతాలీనకృత్ప్రియక పాళీషు ఖెలతి భవా

వ్యాళీ నకుల్యసిత చూళీ భరా చరణ ధూళీ లసన్మణిగణా |

యాళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాళీక శొభి తిలకా

సాళీ కరొతు మమ కాళీ మనః స్వపద నాళీక సేవన విధౌ || 3 || శా. ||


ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -



Friday, January 1, 2021

కాళిదాసకృత అశ్వధాటీ స్తోత్రం -2

 కాళిదాసకృత అశ్వధాటీ  స్తోత్రం -2



సాహితీమిత్రులారా!

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని రెండవ శ్లోకం-

ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సొపాన ధూళి చరణా
పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనొద నిపుణా |
నీపాలయా సురభి ధూపాలకా రితకూపాదుదన్చయతు

మామ్
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ || 2 || శా. ||


ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు




ఏ విధమైన రోగాలు ఆర్థిక ఇబ్బందులు లేని సంవత్సరంగా 2021

ఉండాలని కోరుతూ ఆనంద వత్సరం కావాలని ఆకాంక్షిస్తూ

సాహితీమిత్రులకు 

శ్రేయోభిలాషులకు

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

2021