Tuesday, November 14, 2017

రివర్స్ పాటలు(విలోమంగా పాడే పాటలు)


రివర్స్ పాటలు(విలోమంగా పాడే పాటలు)




సాహితీమిత్రులారా!

అనులోమంగా పాడటం అంటే మామూలుగా పాడటం
విలోమంగా పాడటం అంటే ఆ పాటను ప్రతిపదం
వెనుక నుండి అంటే కుడినుండి ఎడమకు పాడటం
దీన్నే రివర్స్ గేర్ అని అంటారు ఇలాంటివానికూడ
మనం గతిచిత్రంలో చూశాము అలాంటి పాటలు
గురుమూర్తిగారు ప్రతిపాటను రివర్స్ చేసి పాడటం
అతనికి మేథాశక్తి చిత్రకవిత్వపు ధోరణికి తార్కాణం-
ఇక్కడ అతని పాటలు వినండి-



Monday, November 13, 2017

రాట్నబంధం


రాట్నబంధం




సాహితీమిత్రులారా!
రాట్నబంధం కూడ అనేక రకాలు
వానిలో చిత్రమంజరిలోని రాట్నబంధం
ఇది కందపద్యంలో కూర్చబడినది

శ్రీరమణా! నాగశయన!
నారాయణ! వరద! కంజనయనా! కృష్ణా!
వీరవర! వీనతురగా!
సారసనాభా! హరీ! వెసన్ నను గనుమా!

ఈ బంధం రాట్నచక్రం మధ్యనుండి ప్రారంభించి చదవాలి
చక్రం మధ్య చక్రంనుండి క్రిందికి వచ్చి వృత్తంగా చదివి
పట్టె క్రిందికిరావాలి దాని ద్వారా క్రింది పట్టెకు వచ్చిన
చివరికి పూర్తవుతుంది. పద్యం చూస్తూ బంధం చదివిన
పూర్తిగా అవగతమౌతుంది. ఇక చదవండి-


Sunday, November 12, 2017

పాటలు పేరడీగా వ్రాయడమే కాదు


పాటలు పేరడీగా వ్రాయడమే కాదు




సాహితీమిత్రులారా!

పాటలు పేరడీగా వ్రాయడమే కాదు
ఒక పాటను ఒక్కొకరు ఎలాపాడతారో
పాడటం కూడ పేరడీనే అవుతుంది
ఇక్కడ పేరడీ గురుస్వామిగారు
పాడిన
నెల్లూరి నెరజాణ నేకుంకుమల్లె మారిపోనా - 
అనే పాటను విందాం-


Saturday, November 11, 2017

అష్టదళపద్మబంధ గర్భ గుచ్ఛబంధము

అష్టదళపద్మబంధ గర్భ గుచ్ఛబంధము




సాహితీమిత్రులారా!

ఒక బంధములో మరో బంధం ఇమిడ్చిన
బంధచిత్రం ఇక్కడ చూద్దాం-
చిత్రమంజరిలోని ఈ పద్యం చూడండి-

మాణవకములో కూర్చబడినది.
సారవిచార! సరసా!
సారసనా! రాసరసా
సార! సదావాసరసా
సార! సమంథావిరసా!

సారసనా-(సారస-నా) - పద్మము నాభియందుగలవాడా(పద్మనాభా)
రాసరసాసార (రాస-రస-ఆసార)-
                       రాసక్రీడానంద వృష్టిగలవాడా
సదావాసరసాసార-(సదా-ఆవాస-రసా-సార)-
               ఎల్లప్పుడు నివసించు భూధనంగలవాడా
సమంథావిరసా-(స-మంథ-అవి-రసా)-
             మందర పర్వతమునందనురాగముతో కూడినవాడా

బంధాన్ని  పద్యాన్ని చూస్తూ చదివితే
విషయం అవగతం అవుతుంది
గుచ్ఛబంధాన్ని చూస్తే అందులో
అష్టదళపద్మబంధము కనిపిస్తుంది చూడండి-



Friday, November 10, 2017

ధనుర్బంధం


ధనుర్బంధం




సాహితీమిత్రులారా!


ధనుర్బంధాలు అనేకం ఉన్నాయి.
వాటిలో ఇక్కడ కపిలవాయి లింగమూర్తి కృత
శ్రీమత్ప్రతాపగిరిఖండములోనిది.

దీన్ని తేటగీతిలో కూర్చబడినది

మఘవ నుతగుణ మహిమ నామప్రశస్త
దేవ భవభయ భంజన దితిజ తిమిర
నాశ గురుగుణ పూజిత నతవితరణ
గోత్రధర నరవరరూప గుణవిశేష
(శ్రీమత్ప్రతాగిరిఖండము - 3- 101)

ఈ బంధాన్ని పద్యం చూస్తూ
చదివిన విషయం విదితమౌతుంది



Thursday, November 9, 2017

నాగబంధము


నాగబంధము




సాహితీమిత్రులారా!


నాగబంధం అనేక రకాలున్నాయి. వాటిలో ఇక్కడ
మరింగంటి సింగరాచార్య ప్రణీత
దశరథరాజనందన చరిత్రలోనిది
ఈ గ్రంథం పేరును ఒకమారు చదివి గమనించండి
మీ పెదవులు కలుస్తున్నాయేమో
ఇది తెలుగులో కూర్చిన
మొదటి నిరోష్ఠ్య కావ్యం
ఇది రాముని కథ తెలిపే నిరోష్ఠ్య రామాయణము.

ఈ బంధము చంపకమాలావృత్తములో కూర్చబడినది.

నరహరి ధీర సూరి వర నారద వర్ణిత గానలోల శ్రీ
వర కరుణా విచార కరివైరిహర స్థిర భోగపావనా
నిరత నవీన హార ధర నీరజ సద్మవిహా భూరతా
హరినగజాత సారసుత యాతత లంఘన చారువాససా
                                                                              (దశరథరాజనందన చరిత్ర - 5- 308)

ఇందులో నాగము తలనుండి తోకవరకు
చదువగా పై పద్యం కనిపిస్తుంది
ఇక చదవండి-



Wednesday, November 8, 2017

ఆందోళికా బంధం


ఆందోళికా బంధం




సాహితీమిత్రులారా!

ఆందోళిక అంటే పల్లకి
ఆందోళికా బంధం అనేకరకాలు ఉన్నాయి
వాటిలో ఇక్కడ చూడబోతున్న బంధం
బోడి వాసుదేవరావు కృత చిత్రమంజరిలోనిది.
ఇది కందపద్యంలో కూర్చబడింది

సారసనేత్రా! ధీరో
దారా! యరిదర! వరగిరిధర! మురహరణా!
సారరసాబ్ధీ! సారర
సారమణా! నిన్ బొగడ వశమె? నే సరసా!

సారరసాబ్ధీ - శ్రేష్ఠమైన కరుణారసమునకు సముద్రమువంటివాడా
సారరసా రమణా - యోగ్యయైన భూదేవికి భర్తయైనవాడా
సరసా (స-రస-అ)-
అమృత సమేతు(పాను)లైన దేవతల యందు గౌరవము గలవాడా

పద్యాన్ని చూస్తూ బంధాన్ని చదివితే
విషయం సులువుగా అర్థమౌతుంది
ఇక చదవండి-