Wednesday, May 3, 2017

పాదగోపనము


పాదగోపనము




సాహితీమిత్రులారా!




పాదగోపనము అనునది
ఏపాదము గోపనమైన ఆపేరుతో
పిలువబడుచుండును.
ప్రస్తుతము విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
పుట 21న గల పాదగోపనము చూచుచున్నాము.
ఇది నాలుగవ పాదము గోపనము చేయబడినది
అందుచే దీనిని చతుర్థ పాదగూఢము అంటాము.
గమనించుము-

మొదటి మూడు పాదములలో నాలుగవపాదములోని
అక్షరాలను గోపనము చేసి ఉందురు. వాటిని తీసిన
నాలుగవపాదము వచ్చును.

అజ భుజగద్విషద్రథ సుధాషన మానవరక్ష మాధవా
అజిత జనిక్షయాద్యతిగ హారవిభూష కరుఘ్ఘృణాక ర
క్తజనగ నిన్ను తామసులు కాసరుగా వుపమావిదూరగా

దీనిలోని రంగుచేయబడిన అక్షరాలనన్నీ వరుసగా వ్రాసి
నాలుగపాదము
భుజగవరక్షమాధరవిభూకరుణాకర నన్ను కావుమా
అని వచ్చును.

పూర్తి పద్యము ఇక్కడ చూడండి-
అజ భుజగద్విషద్రథ సుధాషన మానవరక్ష మాధవా
అజిత జనిక్షయాద్యతిగ హారవిభూష కరుఘ్ఘృణాక ర
క్తజనగ నిన్ను తామసులు కాసరుగా వుపమావిదూరగా
భుజగవరక్షమాధరవిభూకరుణాకర నన్ను కావుమా


నిరోష్ఠ్య అచ్చతెలుగు సీసము


నిరోష్ఠ్య అచ్చతెలుగు సీసము




సాహితీమిత్రులారా!



కూచిమంచి తిమ్మకవి కృత
అచ్చతెలుగు రామాయణములోని
ఈ నిరోష్ఠ్య సీసము చూడండి-

చలియిక్కదిండి యందెలఱేని జిగి చేగ
                   సింగాణిఁజెఱిచినచేఁకాకాఁడ
జడారి నెలదండఁజని క్రచ్చఱ గయాళి 
                  రాకాసిఁజెండిన రాచకంద
తలఁగని కడకండ్లఁ దగిలి చట్టయి యన్న
                 చాన నేచిననెఱజాణరాయ
నీటార నెదిరిన నేల జేజే దంట
                 తే జెల్ల నడఁచిన దిట్ట లెంక
తండ్రి నైనట్టి నాయాన దాఁట లేక
కడిఁది కాణాచి రాసిరి యెడలఁజేసి
హాళిఁగానల కరిగిన యందగాడ
తలర నిన్గాంచకేఁదాళఁ గలనె యింక
(అచ్చ తెలుఁగు రామాయణము - అయోధ్యకాండ - 93)

ఇందులోని పదాలన్నీ అచ్చ తెలుగు పదాలు
మరియు పెదిమలు తగలకుండా చదవ వచ్చును.

Tuesday, May 2, 2017

దీని వివరింపగదే


దీని వివరింపగదే




సాహితీమిత్రులారా!




ఈ పద్యం వివరించండి-
దీని వివరణ చెప్పగలరేమో చూడండి-

మత్కుణా పగయును మరి ధేను పత్నియు
సింధుసంభవంబు జేర్చి కటువు
భువి విచార ఫలము బొందింప నింపైన
గ్రామ చూర్ణమగును ఖండితముగ

దీని భావం వివరింపలరేమో ప్రయత్నించండి-

సమాధానం -
మత్కుణ - నల్లి
ఆపగ - ఏరు
మత్కుణాపగ - నల్లేరు
ధేను పత్ని - ఆవాలు
సింధుసంభవము - ఉప్పు
కటువు - కారము
విచారఫలము - చింతపండు
గ్రామచూర్ణము - ఊరుబిండి

నల్లేరు, ఆవాలు, ఉప్పు, కారము,
చింతపండు పొందించిన ఇంపైన
ఊరుబిండి అవుతుందట.

నామగోపనం మరోవిధం


నామగోపనం మరోవిధం




సాహితీమిత్రులారా!




నామగోపనం అనేది పద్యంలోని ప్రతిపాదం
మొదటి అక్షరాలము కలుపగా వచ్చేది ఒకటైతే
మరో విధం ఏమిటంటే ప్రతి పద్యం మొదటి
పాదం మొదటి అక్షరం తీసుకోగా అనేక పద్యాలకు
మొదటి అక్షరాలను కలుపగా పేరుగాని మరేదైనై
సూక్తిగాని మంత్రగాని రావడం జరుగుతుంది
ఇలాంటి ఒక ఉదాహరణ ఇక్కడ చూద్దాం.

శ్రీ రమణద్వాదశాక్షరమాలాస్తవము చూడండి-

ఓంతత్పదాఖ్యంపురుషంగుహేశం
భక్తార్తినాశాయశరీరవంతం
గురుం గురూణామజమాదిదేవం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

నవోనవోయోవిలసత్యజప్రం
పుమాన్పురాణోనిఖిత్మభూతః
తంకాలకాలంపరిపూర్ణభావం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

మోక్షార్తిలోకస్య శరణ్యమేకం
మౌనేనసంబోధతభక్తలోకం
మోదస్వరూపం మధురస్వభావం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

భరంవహంతంభజతాంసుఖేన
దయాంబుధిందీనజనేస్వభావాత్
అజ్ఞానమాగో2ప్యవిలోకయంతం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

గతింసమస్తస్వచరాచరస్వ
ప్రశాంతగంభీరతయావిభాంతం
స్తవ్యంస్తవేనాచలితస్వభావం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

వరేణ్యమేకంతమసఃపరస్తాత్
వపుష్మాతామాప్తతమంసతానాం
స్మితేనశాంతింభజతాందదానం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

తేజోదిశంతంమతయే2పిసంతం
నిగూఢమంతహృన్దిసర్వజంతోః
అనంతందృగ్రూపకమప్రమేయం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

శ్రీమానయందీనఇతిప్రభేదాన్
విహాయసామ్యేనసమీక్షమాణం
స్వస్థసదాస్వేసహజేసమాధౌ
త్వామాత్మనాథం రమణంభజేऽహం

రసస్వరూపంరమణంనిజానాం
స్వరూపభక్తింజనయంతమక్ష్ణా
మోహగ్రహోచ్చాటనమాంత్రికంచ
త్వామాత్మనాథం రమణంభజేऽహం

మతప్రభేదానపిపాలయంతం
గరీయసీంభక్తిముదీరయంతం
మతిప్రసాదంభజతాందదానం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

ణా ంతేననామ్నాహృదయంగతేన
దిశంతమానందమమానుషంస్వం
దిశంతముత్సాహబలంప్రకృష్టం
త్వామాత్మనాథం రమణంభజేऽహం

యతోమమాత్మాభవసిత్వమేవ
తతోనవాచ్యంమమకించిదస్తి
త్వమేవసర్వంమమసచ్చిరాత్మాన్
త్వామాత్మనాథం రమణంభజేऽహం

ఇందులోని ప్రతి శ్లోకం మొదటి అక్షరాలన్నీ
కలుపగా
"ఓంనమోభగవతేశ్రీరమణాయ" - అని
ద్వాదశాక్షరమంత్రము వస్తుంది.

Monday, May 1, 2017

ఉత్తర రామాయణములోని నిరోష్ఠ్య సీసము


ఉత్తర రామాయణములోని నిరోష్ఠ్య సీసము




సాహితీమిత్రులారా!


కంకంటిపాపరాజ కృత
ఉత్తర రామాయణంలోని
నిరోష్ఠ్య సీసము చూడండి-
ఇది పెదిమలు తగలకుండా చదువ వచ్చు

జయ దశరథరాజ జఠరసాగరచంద్ర
          జయతాటకాకరంజక కరీంద్ర
జయ ధరాదికజగజ్జాల రక్షాదక్ష
          జయ దయారసనిరంజన కటాక్ష
జయ ఘనాహల్యాఘలయదాంఘ్రి సరసీజ
          జయసహస్రాదిత్య సదృశతేజ
జయచంద్రధరశరాసన ధరాధరశక్ర
          జయనిరీక్షాసక్తజటిలచక్ర
జయ ఖరాది నిశాటశిక్షానిధాన
జయ కిరాతీకృతార్చన సన్నిధాన
జయ నిశాతశరాహత జలనిధాన
జయ జనకకన్యకాధీశ జయనిధాన
                                                  (ఉత్తర రామాయణము - 5- 236)        

ఇది స్థాన చిత్రానికి చెందినది.

ఛత్ర బంధము


ఛత్ర బంధము




సాహితీమిత్రులారా!

వావికొలను సుబ్బారావుగారి
శ్రీకుమారాభ్యుదయములోని
ఛత్ర బంధమును  చూడండి-

జానవనదవ కఖగ పవి
భానవపరపదపరపవ వనజాసన మా
మానస జానవ భ న కా
కానభవనభావిపగఖక వదన వనజా

దీన్ని క్రిందినుండి అంటే
గొడుగు కర్ర దగ్గర నుండి ప్రారంభించాలి

జానవనదవ కఖగ పవి భా - అనేది
క్రిందినుండి పైకి వ్రాయబడుతుంది
అలాగే
మానస జానవ భ న కా
- ఈ అక్షరాలు కర్రమధ్యలో వ్రాయబడతాయి.
అవి గుడ్డలో ఉన్నవిధంగా
వాటిపైన
వపర పదపరపవ - అనే అక్షరాలు
ద
రపర
వ
అని వ్రాయబడతాయి
ఇంతటితో ఛత్ర బంధము
పూర్తవుతుంది
ఇందులో కర్రలో వచ్చిన అక్షరాలే
రెండుమార్లు వస్తాయి. బంధాన్ని
పద్యాన్ని గమనిస్తూ చదవండి కవి
ఎలా కూర్చరో అర్థమౌతుంది.


ద
రపర
వ
మా న స జా న  వ  భ  న  కా
భా
వి
ప
గ
ఖ
క
వ
ద
న
వ
న
జా


Sunday, April 30, 2017

నిరోష్ఠ్య గీతోత్పల పాద గర్భ కందము


నిరోష్ఠ్య గీతోత్పల పాద గర్భ కందము




సాహితీమిత్రులారా!



నిరోష్ఠ్యము అంటే ఓష్ట్యముతో
పలుకబడని అక్షరములతో పద్యం కూర్చుట.
ఇది శబ్దచిత్రము
కందపద్యములో గీత ఉత్పలమాల పద్యముల
పాదములను కూర్చుట గర్భచిత్రము ఈ రెండింటిని
ఒకదానిలో కూర్చుట వలన ఇది మిశ్రమ చిత్రము
అనబడును. పద్యం చూడండి-

కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! స
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!

ఇది పెదిమలు తగలకుండా చదువవచ్చు
అందుకే దీనికి నిరోష్ఠ్యము అని పేరు.

ఇందులోని గీత పద్య పాదము-

కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! స
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!

సరసిజాక్ష! నయాధిక! సైన్య రక్ష!


ఉత్పలమాల పద్య పాదము -
కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! స
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!


సజ్జన రంజనా!సరసిజాక్ష! నయాధిక! సైన్య రక్షకా!