అరిగా బంచమ మేవగించిన
సాహితీమిత్రులారా!
వసుచరిత్రలో రామరాజభూషణుడు
వసంతోత్సవం జరిగే సమయంలో స్త్రీపురుషులు
పాటలు పాడుతున్నారు ఎలాగని కవి వర్ణించారో
ఈ పద్యంలో తెలుస్తుంది గమనించండి-
అరిగా బంచమ మేవగించి నవలా లవ్వేళ హిందోళవై
ఖరి సూపం బికజాతి మాత్మరవభంగవ్యాకులంబైవనీ
ధర నాలంబితపల్లవ వ్రతవిధుల్దాల్పం దదీయధ్విన్
సరిగా గైకొనియెన్ వసంతము మహాసంపూర్ణభావోన్నతిన్
(వసు-1-130)
ఈ పద్యంలో కవి తన సంగీతకళా రహస్యనిధులను విప్పాడు
స్త్రీలు హిందోళరాగం పాడితే కోయిలలు బాధపడ్డాయట.
ఆ రాగంలో తమ స్వరమైన పంచమం లేదని వ్యాకులత చెంది ఆకులూ అలములూ తింటూ చపస్సు చేశాయట. ఆ వ్రతవిధులను మెచ్చి వాసంతం మహాసంపూర్ణభావంతో పంచమస్వరాన్ని స్వీకరించిందట.
కవికి పద్యకల్పనలో రెండు విషయాలు తోడ్పడ్డాయి. హిందోళరాగంలో పంచమమం అంటే రిషభం ఉండవు. (హిందోళంలో - సమగమదనిస - సనిదమగమస అని ఆరోహ అవరోహణలు) ఈ రెండు ఉన్న రాగం హిందోళవసంతం (సగమపదనిదస-సనిదమగరిగస -అని ఆరోహణ అవరోహణలు) ఈ వాస్తవిక లక్షణాలను తీసుకొని విశ్లేషించాడు కవిగారు. ఇది ఇలా ఉంటే అరిగా అనే చోట అరి అంటే శత్రువు అని, అరి అంటే ''రి''లేని(పంచమం లేని) అర్థాలు ఉన్నాయి. దీని బట్టి ఇది చ్యుత చిత్రానికి సంబంధించినదిగా కూడ చెప్పవచ్చు.
No comments:
Post a Comment