ఆశుకవిత్వంపై మొహం మొత్తిందా!
సాహితీమిత్రులారా!
రాయప్రోలు సుబ్బారావుగారు 1911లో
బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో
ఆశుకవిత్వంపై మొహంమొత్తి ఇష్టదేవతా ప్రార్థన ఇలాచేశారు
గమనించండి-
తెనుగే తీయని, దందు పద్య పదరీతి క్రీడలత్యంత మో
హాసముల్ శోభనముల్ తదీయరస రక్తాలాపనంబుల్ లభిం
చిన వాగర్థకలాకలాప జయ లక్ష్మిన్ గాలికింబుత్తునే
జననీ యేమిటి కింక ఆశుకవితా సన్యాస మిప్పింపవే
రసమో, భావమొ, జీవదర్థసుకుమార వ్యంజనామంజు శ
బ్ద సమాసారచనంబొ, సాధు హృదయస్పంద ప్రతిష్టా కథా
విసరంబో, సకలార్థ శూన్యమగు నీవేగాతి వేగోక్తి దు
ర్వ్యసనం బేటికి త్రిప్పుమింక జననీ రమ్యాక్షర క్షోణికిన్
(సమగ్రాంధ్ర సాహిత్యం - 4 - పుట373)
No comments:
Post a Comment