Wednesday, November 3, 2021

ముక్తగ్రస్తాక్షరోత్తర ప్రశ్న పద్యము

 ముక్తగ్రస్తాక్షరోత్తర ప్రశ్న పద్యము





సాహితీమిత్రులారా!



ఈ పద్యంలోని సమాధానాల చివరి అక్షరాన్ని రెండవ ప్రశ్నసమాధానంగా వస్తుంది.

అదేవిధంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాలి పద్యం గమనించండి-


మనుజుని యాకార మహిమకు మొదలేది?

                  నగవైరి వైరికి నగరమెద్ది?

రఘుపతిగాచిన రాక్షస పక్షేది?

     శిబి(సిరి)కన్నులార్జించు చెలువమెద్ది?

పంచబాణునియింటఁబరగినరుచియేది?

             గిరజపతి భుజించు గిన్నెయెద్ది?

నయనాంగరక్షకు నలువొందు చెలువేది?

             చెలఁగిమానముఁగాచు చెట్టదెద్ది?

యన్నిటికిఁజూడ రెండేసి యక్కరములు

యాదులుపంగ తుదలెల్ల నాదులగుచు

చెప్పునాతఁడు భావజ్ఞశేఖరుండు

లక్షణోపేంద్ర పౌఢరా!యక్షితీంద్ర


ఈ పద్యంలోని ప్రతిప్రశ్నకు సమాధానం రెండక్షరాలుగల పదం

ప్రతిపదం చివరి అక్షరం తరువాతి సమాధానంలోని మొదటి అక్షరం 

అయ్యేలాగున సమాధానాలు ఉండాలి

మనుజుని యాకార మహిమకు మొదలేది?

1. తల

నగవైరి వైరికి నగరమెద్ది?

2. లంక

రఘుపతిగాచిన రాక్షస పక్షేది?

3. కాకి

 శిబి(సిరి)కన్నులార్జించు చెలువమెద్ది?

4. కత్తి

పంచబాణునియింటఁబరగినరుచియేది?

5. తీపు

గిరజపతి భుజించు గిన్నెయెద్ది?

6. పుఱ్ఖె

నయనాంగరక్షకు నలువొందు చెలువేది?

7. ఱెప్ప

 చెలఁగిమానముఁగాచు చెట్టదెద్ది?

8. ప్రత్తి


1. త

2. లం

3. కాకి

4. త్తి

5. తీపు

6. పుఱ్ఖె

7. ఱెప్ప

8. ప్రత్తి

No comments: