శ్లోక గర్భిత పద్యం
సాహితీమిత్రులారా!
ఒక పద్యంలో ఒక శ్లోకం ఇమిడ్చి చెప్పబడినది
దీన్ని గర్భచిత్రం అంటాము.
ఇక్కడ గణపవరపు వేంకటకవి కృత
ప్రబంధరాజవేంకటేశ్వర విజయవిలాసములోని 822వ పద్యం
గమనిద్దాం-
చంపకమాల-
నరసఖ నారశాయి నరనాథ నతామర నారదస్తుతా
దరకర ధార దేహ ధరధారి ధరాధిప దారితా శరా
హరిబల హారి కంఠహర హారి హతాహిత హార హృద్ధి దా
స్థిర తర సీర పాణి శివ శీల జితా సుర సింధు బంధనా
దీనిలో ప్రతిపాదం మొదటి 8 అక్షరాలము తొలగించిన
దానిలోని శ్లోకం బహిర్గత మౌతుంది.
నరసఖ నారశాయి నరనాథ నతామర నారదస్తుతా
దరకర ధార దేహ ధరధారి ధరాధిప దారితా శరా
హరిబల హారి కంఠహర హారి హతాహిత హార హృద్ధి దా
స్థిర తర సీర పాణి శివ శీల జితా సుర సింధు బంధనా
ఆ శ్లోకం-
నరనాథ నతామర నారదస్తుతా
ధరధారి ధరాధిప దారితా శరా
హర హారి హతాహిత హార హృద్ధి దా
శివ శీల జితా సుర సింధు బంధనా
No comments:
Post a Comment