దీర్ఘాయష్మాన్ భవ అంటే
సాహితీమిత్రులారా!
చిన్నపిల్లలను పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు.
ఒకసారి కంచి పరమాచార్యులవారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ
మహాస్వాములవారు ఆయన దగ్గరకు వచ్చిన పండితులను
మేము దీవించాలంటే నారాయణ నారాయణ అని దీవిస్తాము
మరి మీరైతే ఎలాదీవిస్తారు అని అడిగారట. దానికి వారు
దీర్ఘాయష్మాన్ భవ సౌమ్య అని దీవిస్తామని చెప్పారట.
దానికి పరమాచార్యవారు అర్థమేమిటని అడిగారట
అదేముంది నిండునూరేళ్ళు జీవించమనికదా అర్థం అన్నారట
దానికి పరమాచార్యవారు అదికాదన్నారట. దానితో పండితులంతా
దాని అర్థం అదేకదా అదికాదంటారేమిటని అలోచనలో పడ్డారట
వారి ఆలోచనకు ఏమీ తట్టటంలేక నిలిచిపోయారట. దానితో
పరమాచార్యవారు నేను చెప్పమంటారా అని అడిగారట. సరే చెప్పమన్నారట.
దీనికి పరమాచార్యవారు ఈవిధంగా చెప్పారట-
మనకు పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, కరణ, యాగాలుంటాయి.
యోగాలలో ఆయుష్మాన్ ఒకటి, కరణంలో బవ ఒకటి,
సౌమ్య వారం అంటే బుధవారం ఈ మూడు కలిసి వస్తే శుభప్రదం
మంచి సౌఖ్యాన్నిస్తాయి కాబట్టి ఆ మూడు కలిసి వచ్చే సౌఖ్యం మీకు కలగాలని దాని అర్థం
అని చెప్పాడట.
No comments:
Post a Comment