Friday, September 10, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 4

భోజమహారాజు - సమస్యాపూరణలు - 4




సాహితీమిత్రులారా!



భోజరాజు ఒకరోజు రాత్రి ఆకల్లాడక తీవ్రమైన ఉక్కతో
అంత:పురకాంతలను తాకనైనా లేక కేవలము
కనుసన్నలచేతనే ఆలింగనాదులన్నీ అనుభవించుచూ
సరససల్లాపమలచేతనే  కాలక్షేపము చేసి ఆ రాత్రి నిదురించెను.
మరునాడు సభలో తాను అనుభవించిన దాన్నిఒక సమస్యగా ఇచ్చాడు.
సమస్య - మరుదాగమవార్తయా2పి శూన్యే
              సమయే జాగ్రతి సంప్రవృద్ధతాపే

(గాలివచ్చు అనుమాట కూడలేని
   పెనువేసవికాలములో
  ఉమ్మదము, వేడిమి మిక్కిలి
  తీవ్రమవుచుండగా.....)

దీన్ని భవభూతి ఈవిధంగా పూరించాడు.
ఉరగీ శిశవే ఋభుక్షవే స్వా
మదిశత్ఫూత్కృతిమాననానిలేన

(ఆ సమయంలో ఆడుపాము ఆకలితో ఉన్న
తనపిల్లనోటిలో తన నోరుపెట్టి 'ఫూ' అని ఊది గాలిమేపు ఇచ్చెను.)

దానికి భోజుడు  - కవిచంద్రా! లోకోక్తిని చక్కగా సమర్థించి చెప్పావు
                         చాల సంతోషమైంది-
                                                         అని అన్నాడు.
తరువాత కాళిదాసు వైపుచూడగా
ఈవిధంగా పూరించాడు.

అబలాసు విలాసినో2స్వభూప
న్నయనై రేవ నవోపగూహనాని


(విలాసపురుషులు తమ ప్రియురాండ్ర ఎడ నూతన
ఆలింగనములను కన్నలచేతనే అనుభవించినవారైరి)
అని చెప్పగా
రాజు మనసులోని అభిప్రాయమునే
చూచినట్లు సూటిగా చెప్పినందులకు
చాల సంతోషముతో సన్మానము చేసెనట.

No comments: