నాలుక కదలని పద్యం
సాహితీమిత్రులారా!
పద్యాన్ని పలికినపుడు నాలుక కదలని అక్షరాలతో
కూర్చిన పద్యాన్ని అచలజిహ్వ అంటారు
ఇవటూరి సూర్యప్రకాశకవి కూర్చిన
తారకాపచయము లోని
అచలజిహ్వా కందం గమనించండి-
అహిపుంగవబాహమహా
మహాపుంగవవాహభీమమఖనముఖమహా
నహభవగంగాభీకమ
ఖహబహుపాపాహిభోగఖగపూగవిభూ
(తారకాపచయము - పుట 25)
ఈ పద్యం పలికి చూడండి నాలుక కదలుతుందేమో!
1 comment:
ఇందులో న, ఙ రెండూ ఉన్నాయి. మరి అచలజిహ్వ ఎలా అయిందో దయచేసి వివరిస్తారా?
Post a Comment