Saturday, July 10, 2021

పాదానికి ఒక అక్షరం పెంచుకుంటూ వెళ్ళే పద్యం

పాదానికి ఒక అక్షరం 

పెంచుకుంటూ వెళ్ళే పద్యం



సాహితీమిత్రులారా!



ఈ పద్యంలో ప్రతి పాదానికి 

ఒక అక్షరం పెంచుకుంటూ వెళ్ళారు

ఇది గణపవరపు వేంకటకవిగారి

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోనిది

గమనించండి-

రారార రారర రూరూర రేరార
         రేరార రీరర రూరరార 
భాభీరు భీభర భారభేరీరేభి
         భూరిభాభాభీ భూభూ భరాభ
నలినీ నివనైక లలనాకళానూన
         లాలనలోలా కళంక లీల 
దరదారి దర ధర కరదదాదోదర
         దార కాదర కరోదారవరద 
గోపబాలక పాలక పాపలోప 
సాలక విలాస వేంకటశైలవాస
భవ్యభాస భవాకారదివ్యరూప
రాధికాస్పుటదిక్కరి కాధరాంగ
                                (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము - 878)


1వ పాదము-       1- అక్షరం- 
రెండవపాదం- రెండక్షరాలు - ,
మూడవపాదం - 3 అక్షరాలు-క,,
నాలుగవ పాదం- 4 అక్షరాలు - క,,,
ఐదవపాదం-  5 అక్షరాలు - క,,ప,,ల
ఆరవపాదం -  6 అక్షరాలు - క,,ల,,శ.
ఏడవపాదం-  7 అక్షరాలు - క,,భ,,ప,,య
ఎనిమిదవపాదం- 8 అక్షరములు - క,,ట,,ధ,,స,

ఈ విధంగా కూర్చబడినది

No comments: