Monday, July 12, 2021

కేవలం పెదిమలతో పలికే పద్యం

 కేవలం పెదిమలతో పలికే పద్యం




సాహితీమిత్రులారా!



 - వర్గాక్షరాలు అంటే ప,ఫ,బ,భ,మ - మరియు
అంతస్థానాలలో- , అచ్చుల్లో - ఉ,ఊ - మరియు
కంఠోష్ట్యాలు - ఒ,ఓ,ఔ - లు వీటిని ఓష్ఠ్యాలు అంటాము.
వీటితో కూర్చబడే పద్యాన్ని లేదే శ్లోకాన్ని (స + ఓష్ఠ్యం) సోష్ఠ్యం అంటాము.
ఇవి కేవలం పెదిమలతో మాత్రమే పలుకబడతాయి.
కాణాదం పెద్దన సోమయాజి గారి ఆధ్యాత్మరామాయణ
అరణ్యకాండలోని 431వ పద్యం ఇది చూడండి.

భూమాప్రేమ సుభావ గోపయువ సుభ్రూ విభ్రమా విద్భవ
వ్యామోహారు విభావ భావ భవ భావ ప్రాప్త భానూద్భవా
భూమీ పార్శ్వ భవద్రుమ ప్రభ శుభాంభో భృద్విభావైభవా
సోమక్ష్మాప వరోపభావ్య విభవ స్తోమా బహుప్రాభవా!


ఈ పద్యంలో పైన మనం చెప్పుకున్న వాటినుండే
కూర్చబడినదిగా గమనించగలము.
దీనిలో  - అనే హల్లులు ఓష్ఠ్యాలు కాదు
కాని వాటికి చేరిన అచ్చులు ఓష్ఠ్యాలుగా గమనించాలి.

No comments: