ఒక పద్యంలో మరో రెండు పద్యాలు
సాహితీమిత్రులారా!
ఒక పద్యంలో అనేక పద్యాలను ఇమిడ్చి
పద్యాన్ని కూర్చితే దాన్ని గర్భచిత్రం అంటాము.
ఇక్కడ ఒక పద్యంలో (చంపకమాలలో) కందము
గీతపద్యాలను ఇమిడ్చికూర్చారు
గున్నేపల్లి మృత్యుంజయకవిగారు
తన శ్రీసూర్యరాయ శతకం101వ పద్యంలో
చూడండి-
సురధరధీరసుస్థిరయశోభరపూర్ణవితీర్ణకర్ణ భా
స్వరచరితాన్వితా హరికృపారసపూరమహాగభీర భీ
కరవరజైత్రసంభృతవికస్వర తేజ కవీంద్రభోజ బం
ధురగుణధీనుతీ స్తుతవిధుస్మరరూపక సూర్యభూపతీ
గర్భస్థకందము-
సురధరధీరసుస్థిరయశోభరపూర్ణవితీర్ణకర్ణ భా
స్వరచరితాన్వితా హరికృపారసపూరమహాగభీర భీ
కరవరజైత్రసంభృతవికస్వర తేజ కవీంద్రభోజ బం
ధురగుణధీనుతీ స్తుతవిధుస్మరరూపక సూర్యభూపతీ
కందము-
ధరధీర సుస్థిరయశో
భరపూర్ణ వితీర్ణకర్ణ భాస్వరచరితా
వరజైత్రసంభృతవిక
స్వర తేజ కవీంద్రభోజ బంధురగుణధీ
గర్భస్థగీతపద్యం-
సురధరధీరసుస్థిరయశోభరపూర్ణవితీర్ణకర్ణ భా
స్వరచరితాన్వితా హరికృపారసపూరమహాగభీర భీ
కరవరజైత్రసంభృతవికస్వర తేజ కవీంద్రభోజ బం
ధురగుణధీనుతీ స్తుతవిధుస్మరరూపక సూర్యభూపతీ
గీతపద్యం-
స్థిరయశోభరపూర్ణ వితీర్ణకర్ణ
హరికృపారసపూర మహాగభీర
భృతవికస్వర తేజ కవీంద్రభోజ
స్తుతవిధుస్మరరూప సూర్యభూప
No comments:
Post a Comment