Wednesday, July 28, 2021

ఒక పదమే ముందు వెనక్కు సమాధానం

 ఒక పదమే ముందు వెనక్కు సమాధానం




సాహితీమిత్రులారా!



ఒక జంట ప్రశ్నలలో ఒక దానికి సమాధానంగా ఇచ్చినది
విలోమంగా చదివితే అది రెండవ ప్రశ్నకు సమాధానమైన
విలోమానులోమ చిత్ర ప్రశ్నోత్తరం అవుతున్నది.

కస్మై యచ్ఛతి సజ్జనో బహుధనం? సృష్టం జగత్కేన వా?
శంభో ర్భాతి చ కో గలే? యువతిభి ర్వేణ్యాం చ కా ధార్యతే?
గౌరీశః క మతాడయత్ చరణతః? కా రక్షితా రాక్షసైః?
ఆరోహా దపరోహతః కలయతా మేకం ద్వయో రుత్కరమ్



1. కస్మై యచ్ఛతి సజ్జనో బహుధనం?
   సజ్జనుడెవరికి ఎక్కువగా ధనదానము చేయును?

   - సాధవే (మంచివానికొరకు)

2. సృష్టం జగత్కేన వా?
   లోకము ఎవనిచే సృష్టించబడెను?

   - వేధసా (బ్రహ్మదేవుని చేత)

3. శంభో ర్భాతి చ కో గలే ?
   శివుని కంఠమున ప్రకాశించేదేది?

   - కాలిమా (నల్లని మచ్చ)

4. యువతిభి ర్వేణ్యాం చ కా ధార్యతే?
   యువతులు కొప్పులో దేన్ని ధరిస్తారు?

   - మాలికా (పూలమాల)

5. గౌరీశః క మతాడయత్ చరణతః ?
   శివుడు ఎవరిని కాలితో తన్నెను?

   - కాలమ్ (యముని)

6. కా రక్షితా రాక్షసైః?
   రాక్షసులచే రక్షింపబడినదేది?

   - లంకా (లంకా నగరం)

మొదటి రెండు ప్రశ్నలకు సమాధానాలు గమనించిన
మొదటిదానికి - సాధవే
రెండవదానికి - వేధసా
మొదటిదానికి విలోమమేకదా
ఇలాగే అన్నిటిని గమనించగలరు.

No comments: