ఒక పదమే ముందు వెనక్కు సమాధానం
సాహితీమిత్రులారా!
ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం మొదటినుండి
చదివేవిధంగా ఉంటే అది అనులోమ లేక గత
ఉత్తరమని, దీని విరుద్ధంగా చివరనుండి మొదటికి
చదివిన దాన్ని ప్రత్యాగత లేక విలోమ ఉత్తరమని
అంటారు.
విదగ్దముఖమండనములోని ఈ ఉదాహరణ చూడండి-
వద వల్లభ సర్వత్ర
సాధు ర్భవతి కీ దృశః
గోవిన్దే నానసి క్షిప్తే
నందవేశ్మని కాऽ భవత్
సమాధానం - క్షీరనదీ
1. వల్లభ సర్వత్ర సాధు ర్భవతి కీ దృశః?
ప్రియా సజ్జనులు సర్వత్రా ఎట్లుందురు?
- క్షీరనదీ దీన్ని త్రిప్పి చదివిన సమాధానం వస్తుంది
అంటే దీనరక్షీ అంటే దీనులను రక్షించేవారుగా ఉంటారు
2. గోవిన్దే నానసి క్షిప్తే నందవేశ్మని కాऽభవత్?
నందుని ఇంట్లో కృష్ణుడు బండిని విరిచినపుడు ఏంజరిగింది?
- క్షీరనదీ దీనిన్ననులోమంగా ఉంచి చదివితే
నందుని ఇంట్లో పాలయేరు ప్రవహించింది.
No comments:
Post a Comment