Thursday, October 6, 2016

సరోజవనా జవనా నదీ:


సరోజవనా జవనా నదీ:


సాహితీమిత్రులారా!

యమకాలంకారం వ్యవధానంతోకూడినది,
వ్యవధానంతోకూడనిది రెండురకాలు
ప్రతిపాదంలో అది వచ్చే స్థలాన్నిబట్టి అంటే
ఆది(మొదట్లో), మధ్య, అంత్య(చివర్లో)
ఆవృత్తమయేవి అని మూడురకాలు.
అవి ఒక పాదంలోనా, రెండుపాదాలలోనా,
మూడు పాదాలలోనా, నాలుగుపాదాలలోనా
అని నాలుగురకాలు.
నాలుగుపాలలో ఆదిలోనా మధ్యలోనా అంత్యంలోనా
ఇలా మరికొన్నిరకాలు. సరే ఇక్కడ మనం నాలుగుపాదాలలో
వ్యవధానంలేకుండా మధ్యలో యమకం వచ్చే దాన్నిగురించి చూద్దాం.

దధత మాకరిభి: కరిభి: క్షతై:
సమనతారసమై రసమై స్తటై:
వివిధకామహితా మహితాంభస:
స్ఫుట సరోజవనా జవనా నదీ:
                          (కిరాతార్జునీయమ్ -5-7)
అర్జునుడు హిమాలయాలకు చేరిన సమయంలో
కవి హిమాలయ వర్ణన చేసిన 15 శ్లోకాలలో ఇది ఒకటి.


ఆకరిభి: = గనులతో కూడిన, కరిభి: = ఏనుగులతో,
క్షతై: = పొడవబడినవై, సమవతార సమై: = దిగుటకు
ఎత్తు పల్లాలు లేని, అసమై: = సాటిలేని, తటై: = తీరాలున్న
(రేవులు), మహితాంభస: = కావలసినంత నీరుగలవి,
వివిధ కామహితా: = స్నానం మొదలైన కోరికలకు
అనుకూలమైనవి, జవనా: = వేగంగా పరుగెత్తు,
నదీ: = నదులను, దధతం = పొంది ఉంది.

ఆ పర్వతంలో ఏనుగులు దంతాలతో పర్వతసానువులను
పొడవగా స్వచ్ఛమైన నీరు వెడలి చెరువులుగా ఏర్పడ్డాయి.
స్నానాదులకు అనుకూలమైన నిండుగా నీరున్న నదులు
వేగంగా పరుగెత్తుతున్నాయి- అని భావం.

దధత మాకరిభి: కరిభి: క్షతై:
సమనతారసమై రసమై స్తటై:
వివిధకామహితా మహితాంభస:
స్ఫుట సరోజవనా జవనా నదీ:

ఇందులో పాదం మధ్యభాగంలో వ్యవధానంలేకుండా
వర్ణసముదాయములు ఆవృత్తమైనవి.
మొదటి పాదంలో కరిభి: ఆవృత్తమైనది.
రెంవపాదంలో రసమై, మూడవపాదంలో మహితా,
నాలుగవపాదంలో జవనా అనే వర్ణసముదాయాలు ఆవృత్తమైనవి
కావున ఇది అవ్యపేత మధ్యయమకమునకు సరైన ఉదాహరణ.

No comments: