Wednesday, October 5, 2016

యాశ్రితా పావనతయా (అష్టదళ పద్మము బంధము)


యాశ్రితా పావనతయా (అష్టదళ పద్మము బంధము)


సాహితీమిత్రులారా!

మనం ఆకారచిత్రంలో అదే
బంధకవిత్వమని పిలువబడే
వాటిలో గోమూత్రికాబంధము,
నాగబంధములను చూశాము.
ఇపుడు పద్మబంధమును గురించి
తెలుసుకుందాము.

యాశ్రితా పావనతయా
యాతనచ్ఛద నీచయా
యాచనీయా ధియా మాయా
యా మాయాసంస్తుతా శ్రియా
(సరస్వతీకంఠాభరణము 4-284)

పావనత్వంచేత ఆశ్రయింపబడినదియు,
ఉన్నతమైన బుద్ధిచేత మాయయందలి
ఆయాసమును(మాయానాశమును) యాచింపదగినదియు,
లక్ష్మిచేత సైతము సంస్తుతింప బడినదియు,
నరకాది కారణమైన యాతనను నాశము చేయును - అని భావం.
పై శ్లోకాన్ని ఈ క్రింది విధంగా వ్రాసిన
అష్టదళ పద్మబంధమౌతుంది గమనించండి.

పై శ్లోకంలో యా అనే అక్షరం 8 పర్యాయాలు
నాలుగుపాదాలలో ఆవృతమైంది.
దీన్ని పుష్పములోని మధ్యలోని దుద్దులో వ్రాయాలి.
పద్యప్రారంభంలోని యాశ్రితా
అనేది పద్యాంతములో తాశ్రియా అని
విలోమంగా వుంది.
ఈ క్రింది బంధచిత్రాన్ని చూస్తే
శ్లోకంలోని అక్షర విన్యాసాన్ని
గమనించవచ్చు



No comments: