Sunday, September 18, 2016

కొమ్ములు - వట్రువసుడుల పద్యం


కొమ్ములు - వట్రువసుడుల పద్యంసాహితీమిత్రులారా!మనం క్రితం తలకట్లు, గుడులు, కొమ్ములు, ఏత్వాలు,
ఐత్వాలతో మాత్రమే కూర్చిన పద్యలను చూచినాము.
ఇపుడు కొమ్ములు - వట్రువసుడుల పద్యం చూద్దాం.
ఇది విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోనిది.

శుక్రుఁడు శుక్రుఁడు నుగ్రుఁడు శుభుఁడు గుహుఁడు
మునులు గురుఁడును సుగుణు లున్ముదులు బుధులు
సుధులు గురువులు పుణ్యులు శ్రుతులు సుతులు
కృతులు నుతులు నుడువుదురు కృష్ణు ధృష్ణు

(ఉన్ముదులు - పుట్టిన సంతోషంగలవారు,
సుతులు - పుత్రులైన బ్రహ్మ, మన్మథులు)

No comments: