Sunday, September 4, 2016

బిందు మిందుముఖీ దదౌ


బిందు మిందుముఖీ దదౌ


సాహితీమిత్రులారా!

ఈ ప్రహేలికను చూడండి.

కాంతే కనకజంబీరం కరే కామపి కుర్వతి
ఆగారలిఖితే భానౌ బిందు మిందుముఖీ దదౌ

కాంతే - ప్రియుడు, కనకజంబీరమ్ - బంగారురంగుగల నిమ్మకాయను,
కరే - చేతినందు, కిమపి కుర్వతి - ఏదోచేయుచుండగా (పట్టి నలుపుచుండగా)
ఇందుముఖీ - చంద్రమదనయైన నాయిక,
ఆగారలిఖితే - ఇంట(ద్వారదేశంలో) చిత్రింపబడిన,
భానౌ - సూర్యప్రతిమయందు,
బిందుదదౌ - సున్నచుట్టెను -
ఇది దీని అర్థం.

దీనికి సరైనవివరణ-

'నిన్ను ఆలింగనం చేసుకునేందుకు ఎప్పుడు వీలౌతుందని' నాయకుడు
కనకజంబీర మర్దనం ద్వారా వెల్లడించాడు.
 దానికి నాయిక సూర్యప్రతిమయందు సున్నచుట్టింది అంటే
మన సమాగమం సూర్యాస్తమయం తర్వాత వీలౌతుందని సూచించింది.

No comments: